News April 2, 2025
ఏపీలో 3 రోజులపాటు తేలికపాటి వర్షాలు

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఇవాళ సత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో చెదురుమదురు వానలు పడతాయని తెలిపింది. అలాగే గురువారం రాయలసీమ, అల్లూరి జిల్లాలోని కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శుక్రవారం ఉత్తరాంధ్ర, కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
Similar News
News November 2, 2025
ఇతిహాసాలు క్విజ్ – 54

1. కర్ణుడిని బ్రహ్మాస్త్ర మంత్రం మరిచిపోయేలా శపించింది ఎవరు?
2. అర్జునుడిని చంపిన తన కొడుకు పేరేంటి?
3. త్రిపురాసురుని సంహారంలో శివుడి రథ సారథి ఎవరు?
4. సతీదేవి దేహం భూమ్మీద పడిన స్థలాలను ఏమంటారు?
5. ఇంద్రుడు భీష్ముడికి ఇచ్చిన వరం ఏమిటి?
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 2, 2025
అన్మోల్‌కు అందించే ఆహారం ప్రత్యేకం

అన్మోల్ సంరక్షణ కోసం రోజువారీ మెనూలో 250 గ్రాముల బాదం, 30 అరటిపండ్లు, 4 కిలోల దానిమ్మ, 5 కిలోల పాలు, 20 గుడ్లు ఉన్నాయి. అదనంగా ఆయిల్ కేక్, పశుగ్రాసం, నెయ్యి, సోయాబీన్స్, మొక్కజొన్నను ఇస్తారు. ఇవన్నీ దాని శరీరాకృతిని, సంతానోత్పత్తి సామర్థ్యం పెంచడం కోసమేనని దాని యజమాని గిల్ తెలిపారు. దీనికి రోజూ 2 సార్లు స్నానం చేయించి.. బాదం, ఆవ నూనెల ప్రత్యేక మిశ్రమంతో దాని శరీరాన్ని మర్దనా చేస్తారు.
News November 2, 2025
కల్తీ కుంకుమని ఇలా గుర్తించండి

కొనే ముందే కుంకుమలోని కల్తీని కనిపెట్టడం మంచిదంటున్నారు నిపుణులు. ఇందుకోసం కొన్ని చిట్కాలు..* నేచురల్ కలర్ కాకుండా గులాబీ, కాషాయం, మరీ ముదురుగా ఉంటే కృత్రిమ రంగులు వాడారని అర్థం. * సహజంగా చేసిన కుంకుమ రంగు చేతికి అంటుకోదు.. అదే అంటుకుందని గుర్తిస్తే కల్తీ చేశారని అర్థం. * గ్లాసీ లుక్ ఉండే కుంకుమల్లో హానికారక డైలు కలిపినట్లే. * నకిలీ కుంకుమైతే నీళ్లలో కలిపితే కరిగిపోకుండా నీటి రంగు మారుతుంది.


