News April 2, 2025
కశింకోట: చెరువులో పడి ట్రాక్టర్ డ్రైవర్ మృతి

కశింకోట మండలం ఉగ్గినపాలెం గ్రామంలో గల చెరువు ఊబిలో కూరుకుపోయి ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందాడు. ఉగ్గినపాలెం గ్రామానికి చెందిన కె.ఈశ్వరరావు (54) కాలకృత్యాలు తీర్చుకోవడానికి మంగళవారం చెరువు వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు ఊబిలో చిక్కుకొని మృతి చెందినట్లు సీఐ స్వామి నాయుడు తెలిపారు. భార్య మహేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
Similar News
News February 27, 2026
వరంగల్: డ్రంకెన్ డ్రైవ్‌లో 111 మందిపై కేసులు

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. గురువారం రాత్రి నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్‌లో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 111 మందిని పట్టుకున్నారు. ట్రాఫిక్ విభాగంలో 42, సెంట్రల్ జోన్‌లో 34, వెస్ట్ జోన్‌లో 16, ఈస్ట్ జోన్ పరిధిలో 19 కేసులు నమోదయ్యాయి. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
News February 27, 2026
నిర్మల్: పాఠశాలల్లో ముగిసిన ఎఫ్‌ఎల్‌ఎన్ సర్వే

జిల్లాలోని 53 పాఠశాలల్లో చేపట్టిన ఎఫ్‌ఎల్‌ఎన్ శాంపుల్ సర్వే ముగిసింది. ఎస్‌సీఈఆర్‌టీ ఆదేశాల మేరకు రెండో తరగతి విద్యార్థులకు తెలుగు, ఉర్దూ, ఆంగ్లం, గణితం సబ్జెక్టుల్లో ‘టాంజెరిన్’ యాప్ ద్వారా 3 రోజుల పాటు మదింపు చేశారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను అంచనా వేయడమే ఈ సర్వే ప్రధాన లక్ష్యమని DEO భోజన్న పేర్కొన్నారు. ఈ ప్రక్రియ విద్యార్థుల విద్యా ప్రమాణాల మెరుగుదలకు ఎంతగానో దోహదపడుతుందని వివరించారు.
News February 27, 2026
‘సీమ ఎత్తిపోతల పథకంపై చంద్రబాబు మౌనం వీడాలి’

సీమ ఎత్తిపోతల పథకంపై CM చంద్రబాబు మౌనం వీడాలని జిల్లా వైసీపీ అధ్యక్షుడు SV మోహన్ రెడ్డి అన్నారు. సీమ ఎత్తిపోతల పథకంపై కౌన్సిల్‌లో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కూటమి నేతలు పారిపోయారని విమర్శించారు. చంద్రబాబుకు చెప్పి పనులు ఆపించామని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కడపలో మార్చి 1న జరిగే ఆరు జిల్లాల సమావేశానికి వైసీపీ నేతలు, రైతులు తరలిరావాలని కోరారు.


