News March 26, 2024

విశాఖ: వన్యప్రాణుల వరుస మరణాలతో గుబులు

image

విశాఖ జంతు ప్రదర్శన శాలలో వన్యప్రాణుల మృత్యువాత ఆగడం లేదు. ఒకదాని తర్వాత ఒకటి చనిపోతుండడం జూలో కలకలం రేపుతోంది. కార్డియో పల్మనరీ వ్యవస్థ విఫలమవ్వడంతో తాజాగా జిరాఫీ మృతి చెందింది. గత నెలలో ఆడ చింపాంజీతో కలుపుకొని కొద్ది నెలల్లోనే ఎనిమిది వరకు చనిపోయాయి. వరుసగా చోటుచేసుకుంటున్న వీటిని చూస్తుంటే జంతువుల సంరక్షణపై అనుమానం కలుగుతోంది. నిజంగా వాటి మృతికి వయసు మీరడమే కారణమా అన్నది సందేహంగా మారింది.

Similar News

News September 8, 2025

విశాఖ: బీజేపీలో కొత్త జోనల్ ఇన్‌ఛార్జ్ నియామకం

image

విశాఖలో BJP రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సమావేశంలో కొత్త జోనల్ ఇన్‌ఛార్జులను ప్రకటించారు. ఉత్తరాంధ్ర జోన్‌కు మట్టా ప్రసాద్, గోదావరి జోన్‌కు లక్ష్మీప్రసన్న, కోస్తాంధ్ర జోన్‌కు నాగోతు రమేష్‌నాయుడు, రాయలసీమ జోన్‌కు ఎన్.దయాకర్ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. పార్టీ బలోపేతానికి వీరు సమన్వయం చేస్తారని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.

News September 8, 2025

హలో వైజాగ్ ఫుడీస్.. మళ్లీ కలుద్దాం..!

image

విశాఖ ఎంజీఎం గ్రౌండ్స్‌లో జరుగుతున్న ఫుడ్ ఫెస్టివల్ ఆదివారంతో ముగిసింది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ప్రముఖ రెస్టారెంట్స్, హోటల్స్‌ల ఫుడ్ ఎంజాయ్ చేశారు. సౌత్, నార్త్ తో పాటు విదేశీ రుచులు కూడా అందుబాటులో ఉన్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో వచ్చి బీచ్ వ్యూలో రకరకాల ఫుడ్‌ని ప్రజలు ఆస్వాదించారు. మరి ఈ ఫుడ్ ఫెస్టివల్‌లో మీ ఫెవరెట్ ఐటెమ్ ఏదో కామెంట్ చేయండి.

News September 8, 2025

విశాఖ ప్రభుత్వ కార్యాలయాలలో పీజీఆర్ఎస్

image

విశాఖపట్నం కలెక్టరేట్‌లో 8వ తేదీ (సోమవారం) ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. అదే విధంగా, సీపీ, జీవీఎంసీ ప్రధాన, జోనల్ కార్యాలయాల్లో కూడా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వినతులు స్వీకరిస్తారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.