News April 2, 2025
వీరఘట్టం: ఎండ తీవ్రతకు వృద్ధురాలి మృతి

వీరఘట్టం మండల కేంద్రంలోని ముచ్చర్ల వీధికి చెందిన మంతిని గౌరమ్మ (85) మంగళవారం మృతి చెందింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గౌరమ్మ ఎండ తీవ్రతను తాళలేక మరణించిందని స్థానికులు తెలిపారు. అయితే ఉదయం పెన్షన్ తీసుకున్న కొద్దిసేపటికి మృతి చెందింది. చుట్టాలు, బంధువులు ఎవరు లేకపోవడంతో వీధిలో ఉన్న వారంతా వచ్చి ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు.
Similar News
News November 5, 2025
133 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

చెన్నైలోని ఆర్మ్‌డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ (<
News November 5, 2025
చేలో కూలీలతో కలిసి కలుపు తీసిన పల్నాడు జిల్లా కలెక్టర్

రాజుపాలెం(M) రాజుపాలెంలో బుధవారం జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పర్యటించారు. సహజ సిద్ధంగా సాగు చేస్తున్న చామంతి, మిర్చి, బొప్పాయి తోటలను పరిశీలించారు. మిర్చి పంటలో జిల్లా కలెక్టర్ కూలీలతో కలిసి కలుపు తీసి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి విధానంలో పండిన కూరగాయలను పరిశీలించి రైతులకు సలహాలు ఇచ్చారు.
News November 5, 2025
ఏళ్లు గడుస్తున్నా ప్రారంభానికి నోచుకోని సాలూరు వంద పడకల ఆసుపత్రి.!

కోట్ల రుపాయలు వెచ్చించి నిర్మిస్తున్న సాలూరు వంద పడకల ఆసుపత్రి ఇంకా కొన్ని పనులు పెండింగ్ ఉండడంతో ప్రారంభంకు నోచుకోలేదు. వైద్య సేవలు అందించేందుకు సరిపడా సిబ్బంది ఉన్నా వసతుల లేమితో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓపీ చూసేందుకు సరిపడా గదులు లేక ఐదుగురు డాక్టర్లు ఒకేచోట ఉండి సేవలు అందిస్తున్నామని సూపరింటెండెంట్ మీనాక్షి తెలిపారు. ఆసుపత్రి తొందరలో ప్రారంభం అయ్యేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.


