News April 2, 2025

ఆరెంజ్ అలర్ట్.. ఇవాళ, రేపు వడగళ్ల వర్షం

image

TG: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేటి నుంచి 4 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని IMD వార్నింగ్ ఇచ్చింది. ఇవాళ నిజామాబాద్, మెదక్, కామారెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు, రేపు ఉమ్మడి మెదక్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వర్షాల వల్ల ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని వెల్లడించింది.

Similar News

News April 4, 2025

IPL: గుజరాత్‌ టైటాన్స్‌కు స్టార్ పేసర్ దూరం

image

నిన్న RCBపై గెలిచి ఆనందంలో ఉన్న గుజరాత్ టైటాన్స్‌కు బ్యాడ్‌న్యూస్. ఆ టీమ్ స్టార్ పేసర్ కగిసో రబాడా వ్యక్తిగత కారణాల వల్ల స్వదేశం వెళ్లిపోయారు. అతడు మళ్లీ ఎప్పుడు జట్టుతో కలుస్తాడనే విషయాన్ని GT వెల్లడించలేదు. పంజాబ్, ముంబైపై ఆడిన రబాడా రెండు వికెట్లు మాత్రమే పడగొట్టారు. నిన్న RCBతో మ్యాచ్‌కు తుది జట్టులో స్థానం దక్కించుకోలేకపోయారు. GT తన తర్వాతి మ్యాచ్‌లో ఈనెల 6న SRHతో తలపడనుంది.

News April 4, 2025

IPL: అట్టడుగుకు పడిపోయిన SRH

image

ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శన చేస్తోంది. ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడింట్లో ఓడింది. దీంతో పాయింట్ల పట్టికలో ఆ జట్టు అట్టడుగు స్థానానికి పడిపోయింది. టేబుల్ టాపర్‌గా పంజాబ్ కింగ్స్ కొనసాగుతోంది. 5 జట్లు 4 పాయింట్లతో, మరో 5 జట్లు 2 పాయింట్లతో నిలిచాయి. పాయింట్స్ టేబుల్‌లో PBKS తర్వాత DC, RCB, GT, KKR, MI, LSG, CSK, RR, SRH ఉన్నాయి.

News April 4, 2025

ఏప్రిల్ 4: చరిత్రలో ఈరోజు

image

1976: నటి సిమ్రాన్ జననం
1841: అమెరికా మాజీ అధ్యక్షుడు విలియం హెన్రీ హారిసన్ మరణం
1942: తెలుగు రచయిత్రి చల్లా సత్యవాణి జననం
1968: పౌరహక్కుల ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్ మరణం
1975: మైక్రోసాఫ్ట్ సంస్థ స్థాపించిన రోజు
గనుల అవగాహన దినోత్సవం

error: Content is protected !!