News April 2, 2025

అనకాపల్లి జిల్లాలో 94.87 పెన్షన్ల పంపిణీ పూర్తి

image

అనకాపల్లి జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద మంగళవారం 94.87 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేసినట్లు డీఆర్డీఏ పీడీ శచీదేవి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 2,56,072 మందికి పెన్షన్ పంపిణీకి రూ.108 కోట్లు విడుదలైనట్లు తెలిపారు. సచివాలయం సిబ్బంది ఇంటింటికీ వెళ్లి 2,43,580 మంది లబ్ధిదారులకు పెన్షన్ సొమ్మును అందజేసినట్లు పేర్కొన్నారు. ఈనెల 5వ తేదీ వరకు పంపిణీకి అవకాశం ఉందన్నారు.

Similar News

News April 4, 2025

మహబూబ్‌నగర్: రెడ్ క్రాస్ డయాగ్నొస్టిక్ స్థలానికి గవర్నర్‌కి ఎమ్మెల్యే వినతి

image

మహబూబ్‌నగర్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డయాగ్నొస్టిక్ సెంటర్‌కు కేటాయించి అధునాతన భవన నిర్మాణానికి చేయూత ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కోరారు. ఎలాంటి లాభపక్ష లేకుండా ఎన్నో సంవత్సరాలుగా పట్టణ ప్రజలకు ఆపత్కాలంలో సేవలు అందిస్తూ తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ రక్తదాన శిబిరాలు నిర్వహించి రక్తాన్ని సేకరించి ప్రాణం పోస్తున్నామన్నారు.

News April 4, 2025

ట్రాక్టర్‌లకు జీపీఎస్ ఖచ్చితంగా ఉండాలి: జనగాం కలెక్టర్

image

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక తరలింపులో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ట్రాక్టర్‌లకు జీపీఎస్ ఖచ్చితంగా ఉండాలని ఆదేశించారు. ఏ గ్రామానికి ఇసుకను తరలిస్తున్నారో ఆ రాకపోకలకు సంబంధించి గ్రామ పంచాయతీ కార్యాలయంలోని రిజిస్టర్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు.

News April 4, 2025

సిద్దిపేట: ‘సమగ్ర ప్రణాళికతో వరి కొనుగోళ్లు జరపాలి’

image

యాసంగి 2024-25 సంబంధించిన వరి ధాన్యం సేకరణ ప్రక్రియను ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా సాఫీగా నిర్వహించేందుకు గాను సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ అబ్దుల్ హమీద్ ఆదేశించారు. జిల్లాలోని వరిధాన్యం కొనుగోలు కేంద్ర నిర్వహకులకు, మండల వ్యవసాయ & వ్యవసాయ విస్తరణ అధికారులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.

error: Content is protected !!