News March 26, 2024

బక్కపడుతున్న చిన్నారులు

image

ఉమ్మడి జిల్లాలో చిన్నారులు బలహీనమవుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ సరైన పోషకాలు అందక బాలలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల సిబ్బంది ఇటీవల నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 4, 203 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా.. 1, 81, 214 మంది ఆరేళ్ల లోపు చిన్నారులున్నారు.

Similar News

News November 17, 2024

నల్లగొండ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్.. సస్పెండ్

image

నల్గొండ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ చేసినందు వల్ల ముగ్గురు వైద్య విద్యార్థునులు, ఒక జూనియర్ డాక్టర్‌ను సస్పెండ్ చేసినట్టు తెలుస్తుంది. 2వ సంవత్సరం విద్యార్థి ఒక నెల, ఇద్దరు 4వ సంవత్సరం విద్యార్థులను ఆరు నెలలు, ఒక జూనియర్ డాక్టర్‌ను మూడు నెలలు కాలేజీ నుంచి సస్పెండ్ చేసినట్లు కాలేజీ వర్గాలు పేర్కొన్నాయి. విద్యార్థినుల పట్ల ర్యాగింగ్ జరుగుతున్నప్పటికీ గుర్తించడంలో విఫలమైనట్లు సమాచారం.

News November 17, 2024

భువనగిరి: గ్రూప్-3 పరీక్ష.. యువతికి రోడ్డు ప్రమాదం

image

గ్రూప్ -3 పరీక్ష రాయడానికి వెళ్తున్న యువతికి గాయాలయ్యాయి. సంస్థాన్ నారాయణపురం చెందిన శృతి భువనగిరిలోని వెన్నెల కాలేజీలో పరీక్ష రాయడానికి వెళ్తుండగా అనాజీపురం వద్ద వారి బైక్‌పై ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో శృతికి గాయాలయ్యాయి. చికిత్స చేయించుకుని తిరిగి పరీక్ష కేంద్రానికి వెళ్లింది. కాగా సమయం ముగియడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తూ వెను తిరిగింది.

News November 17, 2024

NLG: సాగు అంచనా @5,83,620 ఎకరాలు!

image

జిల్లాలో రైతన్నలు యాసంగి సాగుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా యాసంగిలో 5,83,620 ఎకరాల్లో వివిధ పంటలు సాగు కానున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ ఇప్పటికే అంచనా వేసింది. అందులో వరి 5,56,920 ఎకరాలు, సజ్జ 150, జొన్న 2,200, వేరుశనగ 21,000, పెసర 2,000, ఆముదం 350, మినుములు 1,000 ఎకరాల్లో సాగు కానున్నట్లు వ్యవసాయశాఖ భావిస్తోంది.