News April 2, 2025

నెల్లూరు: గురుకులాల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

నెల్లూరు జిల్లాలోని నెల్లూరు అక్కచెరువు పాడు, గండిపాళెం, తుమ్మల పెంట, ఆత్మకూరు గురుకుల పాఠశాలలో 2025 -26 సంవత్సరానికి గాను 5, 6, 7 ,8వ తరగతులలో ప్రవేశం పొందేందుకు అర్హులు ఆన్‌లైన్లో https://aprs.apcfss.in దరఖాస్తు చేసుకోవాలని గురుకులాల జిల్లా కన్వీనర్ జీ. మురళీకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల ఆరో తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని, 25న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. సద్వినియోగం చేసుకొవాలన్నారు.

Similar News

News April 4, 2025

విద్యుత్ సమస్యలపై నెల్లూరు కలెక్టరుకు ఫిర్యాదు

image

దుత్తలూరు మండలం నందిపాడు, వెంకటంపేట గ్రామాల్లో గురువారం కలెక్టర్ ఓ.ఆనంద్ ఎదుట ప్రజలు విద్యుత్ సమస్యలపై ఏకరువు పెట్టారు. లోవోల్టేజీ సమస్య తీవ్రంగా ఉందని, శిథిల స్తంభాలు గాలులకు నేలకొరిగి ఎప్పుడు ఏలాంటి ప్రమాదం సంభవిస్తుందోనని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోయారు. సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. 

News April 3, 2025

సీడ్స్ సంస్థను సందర్శించిన జిల్లా కలెక్టర్

image

దుత్తలూరులోని సీడ్స్ ఉపాధి శిక్షణ సంస్థను కలెక్టర్ ఓ.ఆనంద్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా సంస్థలో జరుగుతున్న కార్యక్రమాలు, అందిస్తున్న సేవలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కుట్టు శిక్షణ, నైపుణ్య శిక్షణ, వ్యవసాయం, కంటి పరీక్షలు తదితర వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు ఈ సంస్థ సేవలందిస్తుందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

News April 3, 2025

ఇఫ్కో సెజ్‌ అభివృద్ధిపై ఎంపీ వేమిరెడ్డి భేటీ

image

నెల్లూరూ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గురువారం ఇఫ్కో సీఈవో ఉదయ్‌ శంకర్‌ అవస్థిని ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయనతో వివిధ అంశాలపై కూలంకుశంగా చర్చించారు. కొడవలూరు మండల పరిధిలో ఉన్న ఇఫ్కో కిసాన్‌ సెజ్‌లో పరిశ్రమలు స్థాపించాలని విజ్ఞప్తి చేశారు. అక్కడ పరిశ్రమలు వస్తే జిల్లా యువతకు ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉంటాయని MP వివరించారు.

error: Content is protected !!