News April 2, 2025
ఉట్నూర్: అస్వస్థతతో ఉపాధి కూలీ మృతి

అస్వస్థతకు గురై ఉపాధి కూలీ మృతిచెందాడు. గ్రామస్థుల వివరాలు.. ఉట్నూర్ (M) అందోలికి చెందిన పారేకర్(34) 3 వారాలుగా ఉపాధి పనులకు వెళ్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం వరకు పని చేసి ఇంటికి చేరుకుని పడుకున్నాడు. కొద్దిసేపటికి అతడికి వాంతులు, విరోచనాలు, ఛాతిలో నొప్పి రావడంతో ఇంద్రవెల్లి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ADBకి తరలించే క్రమంలో మృతిచెందాడు. ఎండ తీవ్రతతో మరణించినట్లు అనుమానిస్తున్నారు.
Similar News
News April 4, 2025
CCI పునరుద్ధరణపై లోక్‌సభలో మాట్లాడుతా: NZB MP

ADBలో సీసీఐ ఫ్యాక్టరీ రీఓపెన్‌పై పార్లమెంట్‌లో మాట్లాడాలని నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌ను CCI సాధన కమిటీ సభ్యులు కోరారు. న్యూ ఢిల్లీ కొత్త పార్లమెంట్ భవన్‌లో ఎంపీ అర్వింద్‌ని గురువారం సభ్యులు కలిసి విన్నవించారు. వారి న్యాయమైన డిమాండ్ గురించి కచ్చితంగా పార్లమెంట్‌లో మాట్లాడుతానని ఎంపీ హామీ ఇచ్చారన్నారు. మాజీ మంత్రి జోగు రామన్న సీసీఐ సాధన కమిటీ సభ్యులు ఉన్నారు.
News April 4, 2025
ఉట్నూర్: గురుకులాల్లో మిగిలిన సీట్లకు దరఖాస్తులు

గిరిజన గురుకుల పాఠశాల పీవీటీజీ బాలుర ఆసిఫాబాద్లో 2025-26 విద్యా సంవత్సరానికి 3వ తరగతి నుంచి 9వ తరగతి వరకు సీట్లు మిగిలాయి. వీటి భర్తీకి ఆదిమ గిరిజన తెగలకు చెందిన కొలాం, తోటి విద్యార్థుల నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్త, ఆర్సీఓ అగస్టీన్ ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారు ASFలోని గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో ఈనెల 9 నుంచి 30 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News April 4, 2025
ADB: ‘జిల్లాలో 27,432 మందికి రుణమాఫీ కాలే’

రుణమాఫీ కాలేక రైతు భరోసా అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైతు స్వరాజ వేదిక జిల్లాధ్యక్షుడు సంగెపు బొర్రన్న అన్నారు. జిల్లాలో 27,432 మంది రైతులకు రుణమాఫీ జరగలేదన్నారు. గురువారం బోథ్‌లో ఆయన మాట్లాడారు. అటు రైతు భరోసా రాకపోవడంతో రైతులు అప్పుల పాలవుతున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి రుణమాఫీ, రైతు భరోసా కల్పించాలని కోరారు. రైతులు రామ్‌రెడ్డి, మురళీధర్‌రెడ్డి, నారాయణ తదితరులు పాల్గొన్నారు.