News April 2, 2025
నిజామాబాద్ జిల్లా ఎండ తీవ్రత

నిజామాబాద్ జిల్లాలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. మంగళవారం ఎడపల్లిలో 39.6℃, మంచిప్ప, గోపన్నపల్లి, నిజామాబాద్, కోటగిరి 39.5, మదనపల్లి, చిన్న మావంది 39.4, మల్కాపూర్ 39.3, పెర్కిట్, మోస్రా 39.2, సాలూరా 39.1, రెంజల్, కల్దుర్కి 38.7, వేల్పూర్, వెంపల్లె 38.6, లక్మాపూర్, చింతలకొండూర్, ముప్కల్, యర్గట్ల 38.4, చందూర్, బాల్కొండ 38.3, పోతంగల్ 38, జక్రాన్‌పల్లి, రుద్రూర్, జకోరా 37.8℃ ఉష్ణోగ్రత నమోదైంది.
Similar News
News April 4, 2025
NZB: ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

నిజామాబాద్ నగరంలోని గాయత్రీ నగర్‌లో ఎర్రమల పవన్ రాజు(25) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు 4వ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. మృతుడు నగరంలోని ఒక బట్టల షాపు వేర్ హౌస్‌లో పని చేసేవాడు. అక్కడ పని చేసే అతడి స్నేహితురాలు వ్యక్తిగత కారణాలతో మృతి చెందగా నాటి నుంచి మానసికంగా కుంగిపోయాడు. ఈ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకోగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.
News April 3, 2025
NZB: ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన

వర్ని(M) జాకోరా, జలాల్పూర్ గ్రామాల్లో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్‌తో కలిసి గురువారం పరిశీలించారు. రైతుల నుంచి ధాన్యం సేకరిస్తున్న ప్రక్రియను పరిశీలించారు. కేంద్రం నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు ఎంత పరిమాణంలో సన్నరకం, దొడ్డురకం ధాన్యాన్ని సేకరించారు. ట్రక్ షీట్స్ వచ్చాయా, బిల్ టాగ్ అయ్యిందా అని ఆరా తీశారు.
News April 3, 2025
నిజామాబాద్: జిల్లాలో తగ్గిన ఎండ తీవ్రత

నిజామాబాద్ జిల్లాలో ఎండ తీవ్రత కాస్త తగ్గింది. బుధవారం గోపనపల్లెలో 37.6℃ నమోదైంది. వైల్పూర్ 37.3, మోస్రా 37.2, పెర్కిట్ 37, కోటగిరి 36.8, వేంపల్లి 36.6, యర్గట్ల, యడపల్లి 36.5, లక్ష్మాపూర్ 36.3, మల్కాపూర్ 36.2, ముప్కాల్, నిజామాబాద్ 36.1, ఆలూరు, బాల్కొండ 36, మెండోరా, భీంగల్, ఇస్సాపల్లి 35.9, మగ్గిడి 35.7℃ నమోదైంది. మిగతా ప్రాంతాల్లోనూ గరిష్ఠ ఉష్ణోగ్రతలు తక్కువగానే ఉన్నాయి.