News March 26, 2024

పరకాల: బాలుడి వైద్యానికి రూ.3.50 లక్షల సాయం

image

పరకాల మండలం వెంకటాపూర్‌కు చెందిన వెంకటేష్,ఆశ్విత కొడుకు మహాన్(1) తలకు కణితి అయింది. కాగా బాలుడి వైద్యానికి ఆర్థిక స్తోమత లేక ఆ తల్లిదండ్రులుకు ఇబ్బంది పడ్డారు. ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ కాగా అమెరికాలో ఉంటున్న NRI మేటమర్రి కామేశ్- ప్రతిమ దంపతులు స్పందించి బాలుడి వైద్యానికి రూ.3.50 లక్షల సాయం అందించి పెద్ద మనస్సు చాటుకున్నారు. బాలుడి నిన్న డిశ్చార్జి కాగా దాతలకు పేరెంట్స్ కృతజ్ఞతలు చెప్పారు.

Similar News

News March 14, 2026

మొదటి రోజు 99.9 శాతం హాజరు: డీఈవో

image

వరంగల్ జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు 9,485 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా, 9,475 మంది హాజరు కాగా 10 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 99.8 శాతం విద్యార్థులు హాజరయ్యారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు డీఈవో రంగయ్య వెల్లడించారు.

News March 14, 2026

WGL: గ్యాస్ సిలిండర్ల బుకింగ్ భారీగా పెరుగుదల

image

పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో గ్యాస్ సరఫరా దెబ్బతింటుందనే ఆందోళనతో జిల్లాలో ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్‌లు భారీగా పెరిగాయి. జిల్లాలో 16 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో జనవరిలో రోజుకు సుమారు 16 వేల బుకింగ్‌లు ఉండగా, శుక్రవారం ఒక్క రోజే 59,200 బుకింగ్‌లు నమోదయ్యాయి. దీంతో అత్యవసరంగా అవసరమైన వారికి సిలిండర్లు ఆలస్యంగా అందుతున్నాయి. సరఫరాలో అంతరాయం లేదని, అవసరానికి మించి బుకింగ్ చేయవద్దని అధికారులు తెలిపారు.

News March 14, 2026

పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు

image

పదో తరగతి పరీక్షల నేపథ్యంలో పరీక్షe కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలు చేస్తామని సెంట్రల్ జోన్ డీసీపీ ధారా కవిత తెలిపారు. శనివారం నుంచి ఏప్రిల్ 16 వరకు సెక్షన్ 163 BNSS (144) అమల్లో ఉంటుందన్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో 150 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్ద గుమికూడడం, సభలు, ర్యాలీలు నిషేధించగా, 500 మీటర్ల పరిధిలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జిరాక్స్ సెంటర్లు మూసివేయాలన్నారు.