News April 2, 2025
బర్డ్ ఫ్లూతో చిన్నారి మృతి.. రాష్ట్రంలో తొలి కేసు

AP: పచ్చిమాంసం తిన్న 2ఏళ్ల బాలిక బర్డ్ ఫ్లూతో చనిపోయిన ఘటన పల్నాడు (D) నరసరావుపేటలో జరిగింది. రాష్ట్రంలో ఈ వైరస్‌తో మనుషులు మరణించడం ఇదే తొలిసారి. అనారోగ్యంతో ఉన్న బాలికను మార్చి 4న మంగళగిరి ఎయిమ్స్‌కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ 16న మృతిచెందింది. పాప స్వాబ్ నమూనాలను పరీక్షించగా బర్డ్ ఫ్లూగా తేలింది. కోడిని కోసేటప్పుడు అడగ్గా ఓ ముక్క ఇచ్చామని, అది తిన్న చిన్నారి జబ్బు పడిందని పేరెంట్స్ చెప్పారు.
Similar News
News September 11, 2025
OTTలోకి వచ్చేసిన రజినీకాంత్ ‘కూలీ’

రజినీకాంత్ హీరోగా నటించిన ‘కూలీ’ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. లోకేశ్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నాగార్జున, శ్రుతిహాసన్, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, సత్యరాజ్, సౌబిన్ తదితరులు నటించారు. అనిరుధ్ సంగీతం అందించారు. ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.
News September 11, 2025
ఇంటర్‌లో ప్రవేశాలు.. రెండు రోజులే ఛాన్స్

TG: ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశాలకు బోర్డు మరో అవకాశం కల్పించింది. ఇవాళ, రేపు ఆన్‌లైన్ <
News September 11, 2025
నేడు బాపట్ల జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. సూర్యలంకలో తాటి మొక్కలు నాటి ‘గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత నగరవనం అటవీ పార్కులో జరిగే జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవంలో పాల్గొని అమరవీరుల స్మారక స్తూపాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం అమరవీరుల కుటుంబాలతో సమావేశమై ఆర్థికసాయం అందజేస్తారు.