News April 2, 2025
విజయవాడలో మహిళ అనుమానాస్పద మృతి

విజయవాడ ఆటో నగర్‌లో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. లక్ష్మి, మహంకాళి దంపతులు చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవిస్తున్నారు. లక్మికి మహంకాలి నాలుగో భర్త. చిత్తు కాగితాలు ఏరగా వచ్చిన డబ్బుతో మద్యం తాగుతుంటారు. మంగళవారం లక్ష్మి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే భర్త మహంకాళి పరారీలో ఉన్నాడు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.
Similar News
News November 13, 2025
VJA: 4 రోజులుగా CT స్కాన్ సేవలు బంద్.. రోగుల అవస్థలు.!

విజయవాడ కొత్త ప్రభుత్వాసుపత్రిలో గత నాలుగు రోజులుగా సీటీ స్కాన్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆసుపత్రి ఆవరణలోని ప్రైవేట్, ప్రభుత్వ సీటీ స్కాన్ పరికరాలు ఒకేసారి పాడైపోవడమే దీనికి కారణం. రోజుకు 200 నుంచి 300 వరకు స్కాన్లు జరిగేవి. ప్రస్తుతం రోగులను అంబులెన్స్‌లో బయట కేంద్రాలకు తరలించి స్కాన్లు చేయిస్తున్నారు. అధికారులు స్పందించి తక్షణమే సీటీ స్కాన్ సేవలను అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.
News November 13, 2025
ఈరోజు తీవ్ర చలి.. జాగ్రత్త!

TG: రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు రాత్రి చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు తెలిపారు. ఈ నెలలో ఇదే కోల్డెస్ట్ నైట్ కానుందని అంచనా వేశారు. రేపు ఉదయానికల్లా ఉష్ణోగ్రతలు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో 10-11°Cకి, నార్త్, వెస్ట్ తెలంగాణలో 7-10°Cకి తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. వీలైనంత వరకు ప్రజలు బయటకు వెళ్లొద్దని, అత్యవసరం అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
News November 13, 2025
MBNR: ఎస్సీ విద్యార్థులకు అకౌంట్లోనే డబ్బులు జమ

ఎస్సీ విద్యార్థులకు ఈ ఏడాది నుంచి స్కాలర్షిప్లు డబ్బులు తమ అకౌంట్‌లోనే జమ అవుతాయని డిప్యూటీ డైరెక్టర్ ఎస్సీ డెవలప్మెంట్ ఆఫీసర్ సునీత అన్నారు. పాలమూరు విశ్వవిద్యాలయంలోని ఫార్మసీ ఆడిటోరియంలో యూనివర్సిటీ విద్యార్థులకు సమావేశం నిర్వహించారు. పీజీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ డి.మధుసూదన్ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ డాక్టర్ నాగం కుమారస్వామి పాల్గొన్నారు.


