News April 2, 2025
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు పడుతోంది. స్వామి వారి దర్శనానికి 9 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 72,981 మంది భక్తులు దర్శించుకోగా 21,120 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో స్వామివారికి రూ.5.09 కోట్ల ఆదాయం సమకూరింది.
Similar News
News April 4, 2025
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఏమైంది..!

ఐపీఎల్ 2025లో తన తొలి మ్యాచులో భారీ విజయం సాధించిన SRH ఆ తర్వాత గాడి తప్పింది. ఆ తర్వాత ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఘోర పరాజయం పాలైంది. LSGపై 5 వికెట్లు, DCపై 7 వికెట్లు, KKRపై 80 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఇలాగే ఆడితే ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారే ప్రమాదం ఉందని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా జట్టులోని ఆటగాళ్లు సమష్ఠిగా రాణించి విజయాలు నమోదు చేయాలని కోరుకుంటున్నారు.
News April 4, 2025
భారీ వర్షాలు.. ఈ నంబర్‌కు కాల్ చేయండి: GHMC

TG: హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో GHMC కమిషనర్ విజయలక్ష్మి జోనల్ కమిషనర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఏవైనా వర్ష సంబంధిత సమస్యలు ఉంటే సాయం కోసం 040-21111111 నంబర్‌ను సంప్రదించాలని సిటిజన్లకు సూచించారు. ఇప్పటికే నీరు నిలిచిన ప్రాంతాలను క్లియర్ చేసినట్లు తెలిపారు.
News April 4, 2025
YCP నేత కేతిరెడ్డి గెస్ట్ హౌస్ స్థలం సర్కార్‌దే: అధికారులు

AP: అనంతపురం జిల్లా ధర్మవరం YCP మాజీ MLA కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గెస్ట్ హౌస్ స్థలం ప్రభుత్వానిదేనని అధికారులు నిర్ధారించారు. ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు వెళ్లగా గేటు వేసి ఉండటంతో వారు వెనుదిరిగారు. ఈ భూమిని కేతిరెడ్డి తన కుటుంబసభ్యుల పేరుతో రిజిస్టర్ చేసినట్లు గుర్తించారు. కాగా గుర్రాలకొండపై కేతిరెడ్డి ఓ అతిథి గృహం నిర్మించుకున్నారు. కానీ ఇది అసైన్డ్ భూమి అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.