News April 2, 2025
AMP: ఉపరితల ఆవర్తనం..నేడు వర్షాలు పడే అవకాశం

నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని దీని ప్రభావంతో బుధవారం కోస్తా జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈదురు గాలులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కోస్తాలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఆకాశంలో మేఘాలు కమ్ముకుంటాయని చెప్పారు. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం లేదా అంతకంటే తక్కువగా నమోదవుతాయన్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
Similar News
News April 4, 2025
రేషన్ దుకాణంలో వనపర్తి జిల్లా కలెక్టర్ తనిఖీ

పేదలకు నాణ్యమైన సన్న బియ్యం అందించాలనే ఉద్దేశంతోనే, ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిందని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. గురువారం శ్రీరంగాపూర్ మండల కేంద్రంలోని రేషన్ దుకాణాన్ని సందర్శించి రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేశారు. అనంతరం రేషన్ దుకాణంలో ఉన్న స్టాక్ రిజిస్టర్, బియ్యం పంపిణీ చేస్తున్న విధానాన్ని పరిశీలించారు.
News April 4, 2025
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఏమైంది..!

ఐపీఎల్ 2025లో తన తొలి మ్యాచులో భారీ విజయం సాధించిన SRH ఆ తర్వాత గాడి తప్పింది. ఆ తర్వాత ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఘోర పరాజయం పాలైంది. LSGపై 5 వికెట్లు, DCపై 7 వికెట్లు, KKRపై 80 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఇలాగే ఆడితే ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారే ప్రమాదం ఉందని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా జట్టులోని ఆటగాళ్లు సమష్ఠిగా రాణించి విజయాలు నమోదు చేయాలని కోరుకుంటున్నారు.
News April 4, 2025
వనపర్తి జిల్లా యువతకు పోలీసుల WARNING

ప్రజలు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డీఎస్పీ బుచ్చయ్య పిలుపునిచ్చారు. గురువారం వనపర్తి పాలిటెక్నిక్ కళాశాలలో తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో వారు రూపొందించిన గంజాయి, కల్తీ కల్లు నిర్మూలనపై రూపొందించిన పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు. మత్తుమందుల వ్యసనాన్ని అందరం కలిసి నిర్మూలించాలన్నారు. ఎవరైనా గంజాయి, డ్రగ్స్ వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.