News April 2, 2025
రుద్రూర్: యువకుడి అదృశ్యం

రుద్రూర్‌కు చెందిన విజయ్ కుమార్ అనే వ్యక్తి అదృశ్యమైనట్టు ఎస్ఐ సాయన్న తెలిపారు. గత ఏడాది ఇల్లు కట్టడానికి అప్పులు కావడం వల్ల విజయ్ కుమార్ మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో గత నెల 11న ఇంట్లో నుంచి వెళ్లిన అతను తిరిగి రాలేదు. పలు చోట్ల వెతికినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో అతని భార్య మంగళవారం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.
Similar News
News April 6, 2025
NZB: చోరీలకు పాల్పడున్న నిందితుడి అరెస్ట్

జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్ ACP రాజా వెంకట్ రెడ్డి శనివారం తెలిపారు. నాందేడ్ జిల్లాకు చెందిన నాందేవ్ ఆనందరావు జిల్లాలోని పలు చోట్ల దొంగతనాలకు పాల్పడ్డాడన్నారు. గత నెల 5న మాక్లూర్ మండలం మాదాపూర్‌లో పరశు దేవానందం ఇంట్లో చోరీ జరిగింది. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు.
News April 5, 2025
KMR: లోన్ యాప్స్ వేధింపులకు సాఫ్ట్వేర్ ఉద్యోగి బలి

ఆన్లైన్ లోన్ యాప్‌ల వేధింపులు భరించలేక సాఫ్ట్వేర్ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సదాశివనగర్‌కు చెందిన సందీప్(29) HYDలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం సందీప్ ఆన్లైన్ లోన్ యాప్స్ ద్వారా రుణం తీసుకున్నాడు. ఏజెంట్లు ఇబ్బందులు పెట్టడంతో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 5, 2025
NZB: సామిల్లో భారీ అగ్నిప్రమాదం

నిజామాబాద్ నగరంలోని పులాంగ్ ప్రాంతంలో ఉన్న ఓ సామిల్లో శుక్రవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగిసి పడ్డాయి. దీనితో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నించారు. పోలీసులు కూడా చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఎంత మేర నష్టం వాటిల్లిందో తెలియాల్సి ఉంది.