News April 2, 2025

ఓడరేవు సొసైటీ సీఈఓని ట్రాప్ చేసి దోచేసిన మహిళ

image

అమలాపురానికి చెందిన ఓడరేవు సొసైటీ సీఈవోని కుమారి అనే మహిళ నిలువుదోపిడీ చేసింది. పోలీసుల వివరాల ప్రకారం.. గత నెల 17న మద్యం తాగి పానీపూరి బండి దగ్గరకు వచ్చిన సొసైటీ సీఈవోని కాకినాడకు చెందిన మహిళ ట్రాప్ చేసింది. ఓ ఇంటికి తీసుకెళ్లి కూల్ డ్రింక్‌లో మత్తు బిల్లలు, గడ్డి మందు కలిపింది. ఆయన అపస్మారక స్థితిలో వెళ్లాక రూ.లక్ష నగదు, ఒంటిపై బంగారం ఎత్తుకెళ్లిపోయారు. ఈ కేసులో మహిళతో పాటు ఇద్దరు అరెస్టయ్యారు.

Similar News

News September 18, 2025

జీకేవీధి: పాము కాటుకు గురై బాలిక మృతి

image

గూడెం కొత్తవీధిలోని బొంతువలసకు చెందిన మర్రి కవిత (9) పాము కాటుకు గురై మృతి చెందింది. ఇంట్లో పడుకున్న సమయంలో బుధవారం తెల్లవారుజామున పాము కాటేసింది. తీవ్ర అస్వస్థతకు గురైన చిన్నారిని తల్లిదండ్రులు పెద్దవలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే బాలిక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బాలిక మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News September 18, 2025

రేపు కాకతీయ యూనివర్సిటీలో జాబ్ మేళా..!

image

యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో రేపు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జాబ్ మేళాలో అనేక కంపెనీలు పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని రిజిస్ట్రార్ సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రొ.జ్యోతి, వైస్ ప్రిన్సిపల్ డా.రహమాన్ పాల్గొన్నారు.

News September 18, 2025

విజయవాడ: దసరాకు 422 ప్రత్యేక బస్సులు

image

దసరా, విజయవాడ ఉత్సవాల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు 422 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 12 డిపోల నుంచి ఈ బస్సులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. రద్దీకి అనుగుణంగా ప్రతి రోజు ఈ ప్రత్యేక సర్వీసులను నడుపుతామని పేర్కొన్నారు.