News April 2, 2025
భీమవరంలో వృద్ధురాలిపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్

భీమవరం పట్టణంలోని ఈ నెల 28న అమ్మిరాజు తోటలో దొంగతనం కేసులో పట్టణానికి చెందిన నిందితుడు విట్టర్ పాల్‌ను సీఐ నాగరాజు తన సిబ్బందితో కలిసి చాకచక్యంగా పట్టుకున్నారు. డీఎస్పీ జై సూర్య తెలిపిన వివరాల ప్రకారం.. వృద్ధురాలు మంగతాయారు ఇంటికి వెళ్లి దగ్గర బంధువునని చెప్పి 3 గంటల పాటు విట్టర్ కబుర్లు చెప్పాడు. ఆమె భర్త బయటకు వెళ్ళగానే వృద్ధురాలిపై బ్లేడుతో దాడి చేసి బంగారాన్ని దొంగిలించాడు.
Similar News
News April 4, 2025
నరసాపురం: లేసు అల్లికదారులతో మాట్లాడిన కలెక్టర్

నరసాపురం మండలం రుస్తుంబాద లేసు పార్కును జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా లేసు అల్లికదారులతో మాట్లాడుతూ నిత్య వినియోగం, బహుమతిగా ఇచ్చేందుకు అనుకూలంగా ఉన్న లేసు ఉత్పత్తులను తయారుచేసి మార్కెటింగ్ పెంచుకోవాలని సూచించారు. ప్రతి ఇంట్లోనూ లేసు అల్లికను తెచ్చి పెట్టుకునేలా నైపుణ్యతను చూపించాలని తెలిపారు.
News April 3, 2025
నరసాపురం: ఉగాది పండక్కి వచ్చి తిరిగి రాని లోకాలకు

నరసాపురం మండలం చిట్టవరంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కట్టా నవరత్నం (బాషా) మృతి చెందిన విషయం తెలిసిందే. నవరత్నం హైదరాబాదులో పని చేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నాడు. ఉగాది పండక్కి వచ్చి తిరిగి హైదరాబాదు వెళ్లేందుకు సిద్ధ పడుతున్నాడు. ఈలోగా ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో తమకు దిక్కెవరు అంటూ నవరత్నం తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. వారి తీరు చూపరులకు కంట తడి పెట్టించింది.
News April 3, 2025
గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సాధించడం అభినందనీయం: కలెక్టర్

రాష్ట్రవ్యాప్తంగా 1.5 లక్షల స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను ఓఎన్‌డీసీ ప్లాట్ ఫారమ్ ద్వారా అమ్మి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సాధించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో గిన్నిస్ బుక్ రికార్డ్స్ సర్టిఫికెట్లను మెప్మా అధికారులు జిల్లా కలెక్టర్‌కు చూపించారు.