News April 2, 2025
పెద్దపల్లి: వేర్వేరు ఘటనల్లో నలుగురి మృతి

ఉమ్మడి KNR జిల్లా వ్యాప్తంగా నిన్న 4గురు మృతిచెందారు. సుల్తానాబాద్(M) పూసాలకు చెందిన N.లింగమూర్తి(39) పెళ్లి కావట్లేదని పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకోగా, గొల్లపల్లి మండల కేంద్రానికి చెందిన జయంతి(25)అనే యువతి కడుపునొప్పి భరించలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గంగాధర(M)కురిక్యాలకు చెందిన O.ప్రశాంత్(40) <<15959874>>కరెంటుషాక్<<>>తో చనిపోయాడు. JGTLరూరల్(M) నర్సింగాపూర్ కెనాల్‌లో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది.
Similar News
News November 12, 2025
జాతీయ క్రీడలకు కుల్కచర్ల విద్యార్థి ఎంపిక

కుల్కచర్లకు చెందిన క్రీడాకారుడు పార్థసారథి రాష్ట్రస్థాయి పెన్సింగ్ పోటీలలో గోల్డ్ మెడల్ సాధించి, నవంబర్ 15న ఢిల్లీలో జరగబోయే నేషనల్ పెన్సింగ్ పోటీలకు ఎంపికయ్యారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు జాతీయ స్థాయిలో రాణించడం ఆనందంగా ఉందని తెలంగాణ రాష్ట్ర పెన్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు తెలిపారు. గ్రామీణ ప్రాంతా యువతను క్రీడాకారులుగా మారుస్తున్నామన్నారు.
News November 12, 2025
సొంత గడ్డపై భారత్‌దే ఆధిపత్యం

టీమ్ఇండియాపై టెస్టుల్లో దక్షిణాఫ్రికాదే పైచేయి. ఇప్పటివరకు ఇరుజట్ల మధ్య 44 టెస్టులు జరగగా సఫారీ టీమ్ 18, భారత్ 16 విజయాలు సాధించాయి. మరో 10 మ్యాచులు డ్రాగా ముగిశాయి. అయితే సొంత గడ్డపై 19 మ్యాచులు ఆడగా టీమ్ ఇండియా 11, దక్షిణాఫ్రికా ఐదింట్లో విజయం సాధించాయి. 3 టెస్టులు డ్రా అయ్యాయి. SA 2008లో చివరగా భారత గడ్డపై టెస్టు మ్యాచ్ గెలిచింది. ఈ నెల 14న ఇరు జట్ల మధ్య కోల్‌కతాలో తొలి టెస్టు ప్రారంభం కానుంది.
News November 12, 2025
రికార్డు స్థాయిలో ఒకేసారి 3 లక్షల గృహ ప్రవేశాలు

AP: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఒకేసారి 3 లక్షల గృహ ప్రవేశాలు జరగనున్నాయి. అన్నమయ్యలోని దేవగుడి పల్లి నుంచి సీఎం చంద్రబాబు వర్చువల్‌గా వీటిని ప్రారంభిస్తారు. పీఎం ఆవాస్ యోజన కింద 2,28,034 లక్షలు, పీఎంఏవై గ్రామీణ్ కింద 65,292, PMAY జన్మన్ పథకం కింద 6,866 ఇళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా గృహ ప్రవేశాలు జరగనున్నాయి. ఆయా జిల్లాల్లో మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.


