News April 2, 2025
కరీంనగర్: వేర్వేరు ఘటనల్లో నలుగురి మృతి

ఉమ్మడి KNR జిల్లా వ్యాప్తంగా నిన్న 4గురు మృతిచెందారు. సుల్తానాబాద్(M) పూసాలకు చెందిన N.లింగమూర్తి(39) పెళ్లి కావట్లేదని పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకోగా, గొల్లపల్లి మండల కేంద్రానికి చెందిన జయంతి(25)అనే యువతి కడుపునొప్పి భరించలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గంగాధర(M)కురిక్యాలకు చెందిన O.ప్రశాంత్(40) <<15959874>>కరెంటుషాక్‌తో<<>> చనిపోయాడు. JGTLరూరల్(M) నర్సింగాపూర్ కెనాల్‌లో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది.
Similar News
News November 4, 2025
ఉండవెల్లి: ఆసుపత్రిలో మొదటి కాన్పు విజయవంతం

ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన వంద పడకల ఆసుపత్రి మూడు నెలల క్రితం ప్రారంభమైన నిన్నటిదాకా ఒక కాన్పు కూడా జరగలేదు. ఎట్టకేలకు మంగళవారం తెల్లవారుజామున ఆడబిడ్డకు పురుడోసుకుంది. మండల కేంద్రానికి చెందిన సంధ్య పండంటి పాపకు జన్మనిచ్చినట్లు స్టాఫ్‌నర్స్ లత తెలిపారు. ఆసుపత్రిలో అనుభవంగల డాక్టర్లు, స్టాఫ్‌నర్స్‌లు ఉన్నారని, గర్భిణీలు నిశ్చింతగా కాన్పులకు రావచ్చన్నారు.
News November 4, 2025
ఉండవెల్లి: కంటైనర్ బోల్తా.. ఇద్దరికీ గాయాలు

ఉండవెల్లి మండల పరిధిలోని వి కేర్ సమీపంలో కంటైనర్ బోల్తా పడిన ఘటనలో ఇద్దరికీ గాయాలయ్యాయి. బెంగళూర్ వైపు వెళ్తున ఓ కంటైనర్ ఉండవెల్లి స్టేజి దగ్గర రాత్రి 12 గంటల సమయంలో అదుపుతప్పి బోల్తా పడింది. డ్రైవర్ శివకుమార్ సింగ్, క్లీనర్ దేవేందర్ సింగ్‌కు గాయాలయ్యాయి. వీరిని 108 అంబులెన్స్‌లో కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించినట్లు పైలట్ శ్రీశైలం, ఈఎంటీ శివశంకర్‌లు తెలిపారు.
News November 4, 2025
DRDOలో 105 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

బెంగళూరులోని DRDO ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (LRDE)లో 105 అప్రెంటీస్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగాల్లో ITI, డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ పాసైనవారు అప్లై చేసుకోవచ్చు. ముందుగా apprenticeshipindia.gov.in పోర్టల్‌లో ఎన్‌రోల్ చేసుకోవాలి. గేట్ స్కోరు, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.drdo.gov.in/


