News April 2, 2025

మెదక్: విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి

image

మనోహరాబాద్(M) కొండాపూర్ పారిశ్రామికవాడలో శ్రీహన్ పాలిమర్ కంపెనీలో మధ్యప్రదేశ్(S) అనుపూరు జిల్లా బలియా గ్రామానికి చెందిన రఘునాథ్ సింగ్(21) అనే కార్మికుడు మృతిచెందాడు. మంగళవారం ఉదయం విధులు నిర్వహిస్తుండగా మిషన్‌‌కు చెందిన వైర్ తగలడంతో షాక్‌కు గురై చనిపోయాడు. యజమాని నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని మృతుడి సోదరుడు ఆరోపించాడు. మనోహరాబాద్ ఎస్సై సుభాష్ గౌడ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News November 2, 2025

HYD: BHEL విజిలెన్స్ వారోత్సవంలో హైడ్రా కమిషనర్

image

HYD BHEL విజిలెన్స్ వారోత్సవంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. అవినీతి నిర్మూలనకు వ్యవస్థలు, చట్టాలు, పౌరుల హక్కులపై అందరిలోనూ అవగాహన అవసరమని అన్నారు. హైడ్రా చేపట్టిన చర్యల వల్ల ప్రజల్లో చెరువుల FTL, బఫర్, నాలాల అవశ్యకతపై అవగాహన పెరిగి, ప్రభుత్వ భూముల పరిరక్షణకు సహకరిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో BHEL E.D కేబీరాజా, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.

News November 2, 2025

SRSP UPDATE: 16 గేట్ల ద్వారా నీటి విడుదల

image

SRSP నుంచి ఆదివారం ఉదయం 9 గంటలకు 16 వరద గేట్ల ద్వారా 47,059 క్యూసెక్కుల నీరు గోదావరిలోకి వదిలినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 56,513 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండగా ఔట్ ఫ్లోగా అంతే నీటిని దిగువకు వదులుతున్నామన్నారు. కాగా ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటిమట్టంతో 80.501 TMCల నీరు నిల్వ ఉందని వివరించారు.

News November 2, 2025

గొల్లప్రోలు: రైలు ఢీకొని 30కిపైగా గొర్రెలు మృతి

image

గొల్లప్రోలు వద్ద రైలు ఢీకొని 30కిపైగా గొర్రెలు మృతి చెందగా, మరో 12 గొర్రెలకు తీవ్రగాయాలయ్యాయి. సుద్దగడ్డ, ఏలేరు వరద నీరు ప్రవహిస్తుండడంతో బ్రిడ్జి కింద నుంచి వెళ్ల లేక గొల్లప్రోలుకు చెందిన గొర్రెల వెంకటరమణ తన గొర్రెలను రైల్వేట్రాక్ మీదుగా పొలంలో మేపేందుకు తీసుకెళ్తున్నాడు. అదే సమయంలో 2 ట్రాక్లపై ఒకే సమయంలో రైళ్లు రావడంతో బెదిరిపోయాయి. రైలు గొర్రెలను ఢీకొనడంతో 30 అక్కడిక్కడే మరణించాయి.