News April 2, 2025
కంట్లో కారం చల్లి బంగారం గొలుసు ఎత్తుకెళ్లారు

కంట్లో కారం చల్లి బంగారం ఎత్తుకెళ్లిన సంఘటన రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రామచంద్రపురానికి చెందిన ఓ మహిళ (45) అల్లుడు సూర్య తేజ (19) స్కూటీ పై లింగంపల్లి తీసుకెళ్తుండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వెంబడించారు. వెనుక నుంచి వచ్చి స్కూటీని ఢీ కొట్టారు. కంట్లో కారంపొడి చల్లి బంగారం గొలుసు ఎత్తుకెళ్లారు. రామచంద్రపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News January 21, 2026
ICC నం.1 బ్యాటర్‌గా మిచెల్

టీమ్ ఇండియాతో వన్డే సిరీస్‌లో అదరగొట్టిన న్యూజిలాండ్ బ్యాటర్ మిచెల్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నం.1 స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఇది వరకు టాప్ ప్లేస్‌లో ఉన్న విరాట్ కోహ్లీ రెండో స్థానానికి పడిపోయారు. అఫ్గానిస్థాన్ ప్లేయర్ ఇబ్రహీం జద్రాన్ టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మను వెనక్కినెట్టి 3వ స్థానానికి చేరుకున్నారు. కాగా భారత్‌తో వన్డే సిరీస్‌లో మిచెల్ రెండు సెంచరీలు బాదిన విషయం తెలిసిందే.
News January 21, 2026
NZB: రెడ్ క్రాస్‌లో డే కేర్ సెంటర్ ప్రారంభం

తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సమన్వయంతో నిజామాబాద్ జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ భవనంలో ఏర్పాటు చేసిన ‘ప్రణాం వృద్ధుల డే కేర్ సెంటర్’ను ప్రభుత్వ సలహాదారు, బోధన్ MLA సుదర్శన్ రెడ్డి, NZB కలెక్టర్, రెడ్ క్రాస్ అధ్యక్షురాలు ఇలా త్రిపాఠితో కలిసి బుధవారం ప్రారంభించారు. వృద్ధుల జీవన విధానం కల్పించడమే ఈ ప్రణాం డే కేర్ సెంటర్ ప్రధాన లక్ష్యమని సుదర్శన్ రెడ్డి అన్నారు.
News January 21, 2026
మద్యం సేవించి డ్రైవింగ్ వద్దు: ఎస్పీ పరితోశ్

జహీరాబాద్ పట్టణంలోని ఎన్‌ఎస్ కన్వెన్షన్ హాల్‌లో ‘అరైవ్ అలైవ్–2026’ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ పరితోశ్ పంకజ్ పాల్గొని విద్యార్థులు, ప్రజలతో రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ చేయించారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. ఆర్‌ఎల్‌ఆర్ పాఠశాల విద్యార్థి సిద్దేశ్వర్ ప్రదర్శనను ఎస్పీ అభినందించారు. జనపద కళాకారుల పాటలు ఆహూతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.


