News April 2, 2025

కరీంనగర్: భక్తులకు గుడ్ న్యూస్.. ఇంటి వద్దకే సీతారాముల కల్యాణ తలంబ్రాలు

image

ఆర్టీసీ కార్గో ద్వారా భద్రాచలం సీతారాముల కల్యాణ తలంబ్రాలను ఇంటి వద్దకే పంపించే ఏర్పాటు ఆర్టీసీ చేసింది. ఒక్కొక్క ప్యాకెట్‌కు రూ.151, ఆన్‌లైన్ లేదా అన్ని బస్టాండ్ కార్గో సెంటర్లు, బుకింగ్ కోసం KNR 91542 98581, 9154298561, GDK 91542 98554, HSB 9154298673, HZB 9154298559, మంథని 9154298554, JGL 7780250439, KRTL 9154298572, MTPL 9154298574, SRCL 9154298576, VMD 9154298574 నంబర్లలో సంప్రదించవచ్చు.

Similar News

News December 31, 2025

KNR: న్యూఇయర్ సెలబ్రేషన్‌లో నిబంధనలు కఠినం

image

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో సీపీ గౌష్ ఆలం ఆంక్షలు విధించారు. బుధవారం రాత్రి 8 నుంచి గురువారం ఉదయం 8 వరకు 163 బీఎన్ఎస్ఎస్ చట్టం అమలులో ఉంటుందని, ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమికూడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. నగరంలోకి భారీ వాహనాల ప్రవేశాన్ని నిషేధించారు. డీజేలు, బాణసంచా వాడకూడదని, డ్రంకెన్ డ్రైవ్, ట్రిపుల్ రైడింగ్‌పై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

News December 31, 2025

జమ్మికుంట: నిలకడగానే పత్తి గరిష్ఠ ధర

image

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో పత్తి గరిష్ఠ ధర నిలకడగానే ఉంది. బుధవారం యార్డుకు 23 వాహనాల్లో 203 క్వింటాళ్ల విడి పత్తిని రైతులు తీసుకొని రాగా.. గరిష్ఠంగా క్వింటాకు రూ.7,400, కనిష్ఠంగా రూ.6,900లకు ప్రైవేట్ వ్యాపారులు బహిరంగ వేలం ద్వారా కొనుగోలు చేశారు. మార్కెట్ కార్యకలాపాలను ఉన్నత శ్రేణి కార్యదర్శి రాజా పరిశీలించారు.

News December 31, 2025

KNR: ఆన్‌లైన్ బెట్టింగ్ భూతానికి మరో యువకుడు బలి

image

ఆన్‌లైన్ బెట్టింగ్‌ల ఉచ్చులో చిక్కుకుని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. తోట ఆదిత్య(34) ఆన్‌లైన్ బెట్టింగ్‌ల వల్ల ఏర్పడిన సమస్యలతో మనస్తాపానికి గురై తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.