News April 2, 2025
కరీంనగర్: వేర్వేరు ఘటనల్లో నలుగురి మృతి

ఉమ్మడి KNR జిల్లా వ్యాప్తంగా నిన్న 4గురు మృతిచెందారు. సుల్తానాబాద్(M) పూసాలకు చెందిన N.లింగమూర్తి(39) పెళ్లి కావట్లేదని పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకోగా, గొల్లపల్లి మండల కేంద్రానికి చెందిన జయంతి(25)అనే యువతి కడుపునొప్పి భరించలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గంగాధర(M)కురిక్యాలకు చెందిన O.ప్రశాంత్(40) <<15959874>>కరెంటుషాక్‌తో<<>> చనిపోయాడు. JGTLరూరల్(M) నర్సింగాపూర్ కెనాల్‌లో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది.
Similar News
News April 4, 2025
చిత్తూరు: 32 మంది కార్యదర్శులకు నోటీసులు

ఆస్తి పన్ను వసూళ్లలో పురోగతి చూపించని 32 మంది ఉద్యోగులకు చిత్తూరు మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ గురువారం షోకాజు నోటీసులు జారీ చేశారు. ఆస్తి పన్ను వసూళ్లలో రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్ 10వ స్థానంలో నిలిచింది. పన్ను వసూళ్లలో సచివాలయంలో పనిచేస్తున్న పలువురు కార్యదర్శులు 75 శాతాన్ని చేరుకోలేదంటూ రెవెన్యూ విభాగం అధికారులు కమిషనర్‌కు నివేదిక అందించారు. దీని ఆధారంగా ఆయన నోటీసులు జారీ చేశారు.
News April 4, 2025
మైదుకూరు : పైపులైన్ పనుల్లో బయటపడ్డ మృతదేహాలు

మైదుకూరు నుంచి కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్‌కు నీరు సరఫరా చేసే పైపులైన్ పనుల్లో కాజీపేట రావులపల్లె చెరువులో పాత మృతదేహాలు వెలికితీయడం కలకలం రేపింది. శ్మశానం లేక చెరువులో పూడ్చిన మృతదేహాలు బయటపడడంతో దుర్వాసన వ్యాపిస్తోందని స్థానికులు ఆరోపించారు. శ్మశానం నిర్మిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడంతో.. విమర్శిస్తున్నారు.
News April 4, 2025
ఉపాధి హామీ పథకంలో కోనసీమ ఫస్ట్: కలెక్టర్

ఉపాధి హామీ పథకం ద్వారా కోనసీమ జిల్లాలో 2024–25 ఆర్థిక సంవత్సరంలో 1.74 లక్షల ఉపాధి వేతనదారులకు పని కల్పించామని కలెక్టర్ మహేష్‌కుమార్ గురువారం తెలిపారు. 57 లక్షల పనిదినాల లక్ష్యానికి గాను 56.80 లక్షల పనిదినాలు కల్పించి రాష్ట్రంలో ప్రథమ స్థానం సాధించిందని తెలిపారు. రోజువారీ సగటు వేతనం రూ.291.20 చెల్లించామన్నారు. కూలీలకు వేతనాల కింద రూ. 165.43 కోట్లు ఖర్చు చేశామన్నారు.