News April 2, 2025

పెద్దపల్లి: భక్తులకు గుడ్ న్యూస్.. ఇంటి వద్దకే సీతారాముల కల్యాణ తలంబ్రాలు

image

ఆర్టీసీ కార్గో ద్వారా భద్రాచలం సీతారాముల కల్యాణ తలంబ్రాలను ఇంటి వద్దకే పంపించే ఏర్పాటు ఆర్టీసీ చేసింది. ఒక్కొక్క ప్యాకెట్‌కు రూ.151, ఆన్‌లైన్ లేదా అన్ని బస్టాండ్ కార్గో సెంటర్లు, బుకింగ్ కోసం KNR 91542 98581, 9154298561, GDK 91542 98554, HSB 9154298673, HZB 9154298559, మంథని 9154298554, JGL 7780250439, KRTL 9154298572, MTPL 9154298574, SRCL 9154298576, VMD 9154298574 నంబర్లలో సంప్రదించవచ్చు.

Similar News

News July 6, 2025

ప్రేమజంట ఆత్మహత్య!

image

AP: ప్రకాశం (D) కొమరోలు(M) అక్కపల్లెలో విషాదం నెలకొంది. పెద్దలు తమ వివాహానికి నిరాకరించడంతో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఇవాళ తెల్లవారుజామున యువతి, యువకుడు మృతదేహాలుగా చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. మృతులు నంద్యాల(D) ప్యాపిలి(M) మాధవరం వాసులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

News July 6, 2025

నేడు మంగళంపల్లి జయంతి

image

నేడు ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు, పద్మవిభూషణ్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి. రాజోలు నియోజకవర్గంలోని శంకరగుప్తంలో 1930 జులై 6న జన్మించిన బాలమురళీకృష్ణ, తన అసాధారణ ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. గాయకుడిగా, స్వరకర్తగా, వాగ్గేయకారుడిగా ఆయన సంగీత లోకానికి అందించిన సేవలు అనన్యసామాన్యం. ఆయన పాడిన పాటల్లో ఈ ఫేవరెట్ ఏదో కామెంట్ చేయండి.

News July 6, 2025

ఎండాడ వద్ద రోడ్డు ప్రమాదం.. బూర్జ మండల వాసి మృతి

image

ఎండాడ వద్ద RTC బస్సు బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో శ్రీకాకుళం(D) బూర్జ(M) ఉప్పినివలసకు చెందిన వెంకటరమణమూర్తి(45) మృతి చెందాడు. PMపాలెం CI బాలకృష్ణ వివరాల ప్రకారం.. రమణమూర్తి భార్య, పిల్లలతో కలిసి విశాఖలో ఉంటున్నాడు. శనివారం RDO ఆఫీసుకి వెంకట్రావుతో కలిసి రమణమూర్తి శ్రీకాకుళం వెళ్లారు. తిరిగి వస్తుండగా ఎండాడ వద్ద బస్సును ఓవర్‌టేక్ చేసే సమయంలో ప్రమాదం జరిగి రమణమూర్తి చనిపోగా వెంకట్రావు గాయపడ్డాడు.