News April 2, 2025
NZB: ఆత్మహత్య.. చికిత్స పొందుతూ మృతి

నిజామాబాద్ రూరల్ మండలంలోని ఆకుల కొండూరులో ఓ యువకుడు ఆన్‌లైన్ గేమ్స్‌లో డబ్బులు పోగొట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాలు.. గ్రామానికి చెందిన ఆకాశ్(24) ఆన్‌లైన్లో డబ్బులు పెట్టి గేమ్స్ ఆడాడు. అందులో దాదాపుగా రూ.5లక్షల వరకు పోగొట్టుకున్నాడు. ఇంట్లో వారికి తెలిస్తే కోప్పడతారని గడ్డి మందు తాగాడు. మంగళవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News April 4, 2025
ఉపాధి హామీ పథకంలో కోనసీమ ఫస్ట్: కలెక్టర్

ఉపాధి హామీ పథకం ద్వారా కోనసీమ జిల్లాలో 2024–25 ఆర్థిక సంవత్సరంలో 1.74 లక్షల ఉపాధి వేతనదారులకు పని కల్పించామని కలెక్టర్ మహేష్‌కుమార్ గురువారం తెలిపారు. 57 లక్షల పనిదినాల లక్ష్యానికి గాను 56.80 లక్షల పనిదినాలు కల్పించి రాష్ట్రంలో ప్రథమ స్థానం సాధించిందని తెలిపారు. రోజువారీ సగటు వేతనం రూ.291.20 చెల్లించామన్నారు. కూలీలకు వేతనాల కింద రూ. 165.43 కోట్లు ఖర్చు చేశామన్నారు.
News April 4, 2025
పాడేరు: ‘రూ.456 కోట్లతో రోడ్లు అభివృద్ధి పనులు’

అల్లూరి జిల్లాలో మారుమూల గ్రామాలకు రహదారులు నిర్మించి, డోలీ మోతల రహితంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందని జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేశ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం పాడేరులోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రూ.456 కోట్లతో రహదారుల అభివృద్ధి, కొత్త రోడ్లు నిర్మాణాలు, 26 వంతెనల నిర్మాణాలను మంజూరు చేయడం జరిగిందని స్పష్టం చేసారు.
News April 4, 2025
టంగుటూరులో కారు ఢీకొని ఒకరి మృతి

టంగుటూరు టోల్ ప్లాజా సమీపంలో కారు ఢీ కొట్టడంతో గుర్తు తెలియని వ్యక్తి గురువారం రాత్రి మృతి చెందాడు. సుమారు 40 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తిని కారు ఢీ కొనటంతో అతని తలకు బలమైన గాయాలై చనిపోయాడు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను పెట్రోలింగ్ పోలీసులు టంగుటూరు ఎస్సైకు సమాచారం అందించారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.