News April 2, 2025
HYD: పల్లె నుంచి పట్నంకు తాటి ముంజలు

నగరవాసుల వేసవి తాపాన్ని తీర్చేందుకు తాటిముంజలు వచ్చేశాయి. ముషీరాబాద్, రాంనగర్ డౌన్, బయోలజికల్ ఈ లిమిటెడ్, అడిక్‌మెట్ ఫ్లై ఓవర్ తదితర ప్రాంతాల్లో ఈ వ్యాపారం జోరందుకుంది. డజన్ మంజలు రూ.120 నుంచి రూ.150 వరకు అమ్ముతున్నారు. ఇవి తింటే జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. వడదెబ్బ తాకిన వారు వీటిని తింటే వెంటనే కోలుకుంటారు. ఆరోగ్యం మీద శ్రద్ధతో ధరలు ఎక్కువున్నా HYD వాసులు కొనేందుకు మొగ్గుచూపుతున్నారు.
Similar News
News April 4, 2025
ఖైరతాబాద్: టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన మేయర్

గ్రేటర్ పరిధిలో వర్షాల పట్ల జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి జోనల్ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. లోతట్టు ప్రాంతాలు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలని అన్నారు. వాటర్ లాగిన్ పాయింట్లను గుర్తించాలన్నారు. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే జీహెచ్ఎంసీ నంబర్ 040-21111111కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
News April 3, 2025
HYD: అప్రమత్తంగా విద్యుత్‌శాఖ సిబ్బంది

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షం కారణంగా చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆయా ప్రాంతాలను విద్యుత్‌శాఖ సిబ్బంది, అధికారులు పరిశీలిస్తున్నారు. వెంట వెంటనే మరమ్మతులు చేపట్టి విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నారు. వర్షం కురుస్తున్న నేపథ్యంలో కరెంటు స్తంభాలకు, ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా ఉండాలని సూచించారు.
News April 3, 2025
GHMC అప్రమత్తంగా ఉంది: మంత్రి పొన్నం

హైదరాబాద్‌లో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాలని హైదరాబాద్ ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 6 జోన్లలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎర్రమంజిల్ ప్రాంతంలో చెట్టు కూలడంతో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ ఐఆర్టీ టీమ్స్ వాటిని క్లియర్ చేస్తుందని పేర్కొన్నారు.