News April 2, 2025
RGM: NTPC విద్యుత్ పరిశ్రమలో 15, 037M.Uప్రొడక్షన్

రామగుండం NTPCవిద్యుత్ పరిశ్రమలో గత ఆర్థిక సంవత్సరంలో 15,037 మిలియన్ యూనిట్ల(MU) విద్యుత్ ఉత్పత్తి సాధించినట్లు అధికార వర్గాలు ప్రకటించాయి. 500 మెగావాట్ల 4వ యూనిట్లో 280 రోజులలో విద్యుత్ ఉత్పత్తి చేపట్టి రికార్డు సృష్టించిందన్నారు. 200 మెగావాట్ల 3వ యూనిట్‌లో వంద రోజులపాటు పనిచేసి అత్యధిక విద్యుత్ ఉత్పత్తి చేసిందన్నారు. 62% శాతం PLFనమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
Similar News
News February 28, 2026
వాంఖడేలో ‘రవిశాస్త్రి’ స్టాండ్

వాంఖడే స్టేడియంలో లెవెల్-1 స్టాండ్‌కు మాజీ కెప్టెన్ రవిశాస్త్రి పేరు పెట్టాలని ముంబై క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించింది. క్రికెటర్, కోచ్, కామెంటేటర్‌గా ఆయన సేవలకు గుర్తింపుగా ప్రెస్ బాక్స్ కింది స్టాండ్‌కు ఆయన పేరు పెట్టనున్నారు. అలాగే దిలీప్ సర్దేశాయ్, ఏక్‌నాథ్ సోల్కర్, డయానా ఎడుల్జీ పేర్లను స్టేడియం గేట్లకు పెట్టనున్నారు. ముంబై దిగ్గజాలను గౌరవించే క్రమంలో అపెక్స్ కౌన్సిల్ దీనికి ఆమోదం తెలిపింది.
News February 28, 2026
తిరుపతి: మద్యం మత్తులో ఘర్షణ.. వ్యక్తిపై కత్తిపోట్లు

మద్యంమత్తులో జరిగిన గొడవ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. యువకుల మధ్య తలెత్తిన వివాదంలో కత్తిపోట్లు కలకలం రేపాయి. తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని తిరుమలనగర్‌కు చెందిన కొందరు యువకులు మద్యం మత్తులో గొడవపడ్డారు. దీంతో ఓ యువకుడు తన వద్ద ఉన్న కత్తితో తోటి వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. స్థానికులు క్షతగాత్రుడిని రుయా ఆసుపత్రికి తరలించారు.
News February 28, 2026
రంగారెడ్డి: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

పోక్సో కేసులో నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష, రూ.15 వేల జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా పాస్ట్ ట్రాక్ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి పద్మావతి తీర్పునిచ్చినట్లు ఇన్స్పెక్టర్ శంకర్ కుమార్ నాయక్ తెలిపారు. 2019లో 17ఏళ్ల బాలికను సైదాబాదాద్‌కు చెందిన బ్యాగరి సంతోష్ (26) ప్రేమ పేరుతో నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అతడిపై కేసు నమోదైంది.


