News April 2, 2025
వరంగల్: గ్రూప్-1 ఫలితాల్లో సత్తా చాటిన యువకుడు

ఐనవోలు మండలం పున్నేలు గ్రామానికి చెందిన ఎండి.విలాయాత్ అలి(25) ఇటీవల ప్రకటించిన గ్రూప్-1 ఫలితాల్లో సత్తాచాటాడు. 489.5 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 86వ ర్యాంక్, జోనల్ స్థాయిలో Bc-E కేటగిరిలో మొదటి ర్యాంక్ సాధించాడు. తనకు డిప్యూటీ కలెక్టర్ వచ్చే అవకాశం ఉందని విలాయత్ తెలిపారు. దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన తాను.. తల్లితండ్రుల ప్రోత్సాహంతో గ్రూప్-1లో రాష్ర్టస్థాయిలో రానిచ్చినట్లు పేర్కొన్నాడు.
Similar News
News April 3, 2025
వరంగల్: 4 బార్ల లైసెన్స్‌లకు దరఖాస్తు

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గతంలో రెన్యువల్ కాకుండా మిగిలిన 4 బార్లకు సంబంధించి మళ్లీ లైసెన్స్‌లు జారీ చేయనున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి చంద్రశేఖర్ తెలిపారు. అర్హులు, ఆసక్తి గలవారు ఈనెల 26 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈనెల 29న కలెక్టర్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా ద్వారా బార్లు మంజూరు చేస్తామని వెల్లడించారు.
News April 3, 2025
వర్ధన్నపేట: కనిపిస్తే ఫోన్ చేయండి

బుధవారం వర్ధన్నపేటలోని ఎస్బీఐ బ్యాంక్ వద్ద సినీ ఫక్కీలో చోరీ జరిగిన విషయం తెలిసిందే. నందనం భారతమ్మ అనే వృద్ధురాలిని నమ్మించి ఓ వ్యక్తి రూ.3లక్షలు దోచుకెళ్లాడు. కాగా, నిందితుడి ఫోటోను వర్ధన్నపేట పోలీసులు విడుదల చేశారు. అతడి వివరాలు తెలిపితే రూ.10వేల నగదు ఇస్తామన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని వర్ధన్నపేట సీఐ శ్రీనివాస్ రావు తెలిపారు.
News April 3, 2025
ప్రాతఃకాల విశేష దర్శనంలో భద్రకాళి అమ్మవారు

భద్రకాళి దేవస్థానంలో చైత్ర మాసం గురువారం ఆలయ అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు. ప్రాతఃకాల విశేష దర్శనంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. భక్తులు ఆలయానికి చేరుకొని భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భద్రకాళి దేవస్థానం అర్చకులు, భక్తులు తదితరులున్నారు.