News April 2, 2025
పెద్దపల్లి: వివాహం కావడం లేదని వ్యక్తి ఆత్మహత్య

సుల్తానాబాద్ మండలం పూసాలలో ఓ వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. ఎస్‌ఐ శ్రావణ్ ప్రకారం.. నల్ల లింగమూర్తి(39) PDPLలో ఓ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. వివాహం కావడం లేదనే మనస్తాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎలుకల మందు తాగడంతో కుటుంబసభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందాడు. సోదరుడు రాజేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News April 4, 2025
జమ్మికుంట: మున్సిపల్ కమిషనర్‌కు రాష్ట్రస్థాయి అవార్డు

ఆస్తిపన్ను వసూళ్లలో రాష్ట్రస్థాయిలో జమ్మికుంట మొదటిస్థానం దక్కించుకుంది. దీంతో మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్‌కు మున్సిపల్ పరిపాలన కమిషనర్, డైరెక్టర్ కె.శ్రీదేవి హైదరాబాద్‌లో గురువారం రాష్ట్రస్థాయి ప్రశంసాపత్రం అందజేశారు. అదేవిధంగా చొప్పదండి పట్టణంలో 84శాతం ఆస్తిపన్ను వసూలు చేసినందుకు మున్సిపల్ కమిషనర్ నాగరాజును అభినందించారు.
News April 4, 2025
కేంద్రమంత్రి వీరేంద్ర కుమార్‌ను కలిసిన మంత్రి పొన్నం బృందం

కేంద్ర సామాజిక న్యాయం,సాధికారత శాఖ మంత్రి డా.వీరేంద్ర కుమార్ తో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి కొండా సురేఖ, BC ఎమ్మెల్యేలలతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో కుల గణన చేసి అసెంబ్లీలో 42% రిజర్వేషన్లు బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపించామని తెలిపారు. కేంద్రం బిల్లును ఆమోదించి రిజర్వేషన్లు అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని గురువారం వీరేంద్ర కుమార్‌ను మంత్రి కోరారు.
News April 3, 2025
SC, ST అట్రాసిటీ కేసులు 30లోగా పరిష్కరించాలి: బక్కి వెంకటయ్య

వివిధ దశల్లో పెండింగ్లో ఉన్న SC, STఅట్రాసిటీ కేసులను ఈనెల 30లోగా పరిష్కరించాలని రాష్ట్ర SC, ST కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌస్ ఆలం, జిల్లా అధికారులతో ల్యాండ్, ప్రభుత్వ సేవలు, అట్రాసిటీ తదితర అంశాలపై కమిషన్ ఛైర్మన్, సభ్యులు ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉద్యోగ నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.