News April 2, 2025

గుంటూరు: మద్యం సీసాతో దాడి.. ఒకరి మృతి

image

గుంటూరు శివారు రెడ్డిపాలెంలో ఒకరు హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రామ్ నాయక్ (60) కాగితాలు ఏరుకొని జీవనం సాగిస్తాడు. రాజుతో కలిసి ఇద్దరు మద్యం తాగారు. ఇద్దరి మద్య వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో రాజు మద్యం బాటిల్‌తో రామ్‌నాయక్‌పై దాడి చేశాడు. దీంతో రామ్ నాయక్ స్పాట్‌లోనే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News July 5, 2025

బాసర: ట్రిపుల్ ఐటీలో మీడియాపై ఆంక్షలు ఇంకెన్ని రోజులు..?

image

బాసర ట్రిపుల్ ఐటీ కాలేజీలో మూడేళ్లకు పైగా మీడియాపై ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. వర్సిటీలోకి మీడియా వస్తే అక్కడ నెలకొన్న సమస్యలు, అవినీతి, అక్రమాలు వెలుగులోకి వస్తాయన్న కారణంతో ఈ ఆంక్షలు విధించారని పలువురు ఆరోపిస్తున్నారు. విద్యార్థులు సైతం మీడియాకు ఏ సమాచారం ఇవ్వొద్దని రూల్స్ పెట్టినట్లు సమాచారం. నిన్న స్టూడెంట్ సెలెక్టెడ్ లిస్టు విడుదల ప్రోగ్రాంకు మీడియాను ఆహ్వానించడంలేదని చెప్పడం గమనార్హం.

News July 5, 2025

మరో 30, 40 ఏళ్లు జీవించాలని ఉంది: దలైలామా

image

ప్రజలకు సేవ చేసేందుకు మరో 30, 40 ఏళ్లు జీవించాలని ఆశగా ఉందని టిబెట్ బౌద్ధమత గురువు దలైలామా అన్నారు. బుద్ధుడి బోధనల వ్యాప్తికి కృషి చేస్తానని చెప్పారు. రేపు ఆయన 90వ పుట్టినరోజు జరుపుకోనున్న నేపథ్యంలో అవలోకితేశ్వర ఆశీర్వాదాలు తీసుకున్నారు. కాగా తనకు 90 ఏళ్లు నిండటంతో 15వ దలైలామా ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని ఇటీవల ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు.

News July 5, 2025

ఎండాడలో యాక్సిడెంట్.. ఒకరి మృతి

image

ఎండాడ జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా వాహనాలను మళ్లీస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.