News April 2, 2025
ఊర్కోండ: ఒంటరి మహిళ, ప్రేమ జంట కనిపిస్తే అంతే సంగతులు!

ఊర్కోండ మండలంలోని పేట ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో వివాహితపై 8 మంది సామూహిక అత్యాచారం చేసిన ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. కొంతకాలంగా దేవాలయం వద్దకు వచ్చే మహిళల పట్ల పోకిరీల ఆగడాలు అధికమైనట్లు తెలుస్తుంది. గతంలో అనేకమంది మహిళలకు వేధింపులు ఎదురైనట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేస్తే మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
Similar News
News November 8, 2025
విశాఖపై దక్షిణాఫ్రికా క్రికెట్ కామెంటేటర్ భావోద్వేగ ట్వీట్

దక్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత కాస్ నాయుడు (Kass Naidoo) విశాఖతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. #CWC25 సందర్భంగా విశాఖ వచ్చిన ఆమె భావోద్వేగంగా స్పందించారు. తన తాత అనకాపల్లిలో పుట్టారని.. 57 ఏళ్ల క్రితం తన అమ్మ కూడా విశాఖలోనే ఉండేవారని గుర్తు చేసుకున్నారు. భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్‌ను క్రీడా రంగంలోని ఉత్తములతో కలిసి వ్యాఖ్యానం చేయడం ఎప్పటికీ గుర్తుండిపోతుందంటూ ట్వీట్ చేశారు.
News November 8, 2025
దేశంలోనే మొదటి పురోహితురాలు

సాధారణంగా పెళ్లిళ్లు, అన్నప్రాశనలు, పూజలు వంటివన్నీ పురుషులే చేస్తుంటారు. కానీ కలకత్తాకి చెందిన నందిని భౌమిక్ పదేళ్లుగా పురోహితురాలిగా వ్యవహరిస్తోంది. నందిని రెండో కూతురి వివాహానికి పురోహితుడు ఎవరూ దొరక్కపోవడంతో ఆమే పురోహితురాలిగా మారారు. ఈ నిర్ణయాన్ని పురుషుల కంటే మహిళలే ఎక్కువగా వ్యతిరేకించారంటున్నారు నందిని. ఎప్పటికైనా ప్రజల ఆలోచనా విధానంలో మార్పు తీసుకురావాలనేదే తన ఉద్దేశం అని చెబుతున్నారామె.
News November 8, 2025
వరంగల్: సెలవు పెడితే ప్రభుత్వానికి గండి

రిజిస్ట్రార్ సెలవు పెట్టిందే తడువు మూడు రోజుల్లో 21డాక్యుమెంట్లను ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్(జూనియర్ అసిస్టెంట్) రిజిస్టర్ చేసిన ఘటన HNK(D) భీమదేవరపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగింది. నిబంధనలకు విరుద్దంగా ఉనికిచర్లలోని 2 సర్వే నంబర్లలో నాన్ లేఅవుట్ వెంచర్లలో 15 ప్లాట్లు, 6 ఇండ్లు సహా మొత్తం 21 రిజిస్ట్రేషన్లు చేశాడు. నిబంధనల ప్రకారం నాన్ లేఅవుట్ వెంచర్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయొద్దు.


