News April 2, 2025
పెద్దాపురం: కాండ్రకోట నూకాలమ్మ జాతరలో విషాదం

పెద్దాపురం మండలం కాండ్రకోట నూకాలమ్మ జాతరలో విషాదం చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి ఇద్దరు ఏలేరు కాలువలోకి స్థాన్నానికి దిగి గల్లంతు అయ్యారు. స్థానికులు వివరాలు.. కాకినాడ, జగన్నాధపురం బిర్యానీ పేటకు చెందిన పిరమాడి విశాల్ (7), కొప్పాడి బాలు (22) ఇద్దరి గల్లంతవ్వగా బాలుడు మృతదేహం బుధవారం లభ్యమైంది. మరో మృతదేహం కోసం పెద్దాపురం ఎస్సై వి.మౌనిక ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు.
Similar News
News April 9, 2025
VZM: ‘డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ’

ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పరీక్షలకు సిద్ధమయ్యే డీఎస్సీ అభ్యర్థుల నుంచి ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గురజాడ అప్పారావు బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ కె.జ్యోతిశ్రీ మంగళవారం తెలిపారు. జిల్లా కేంద్రంలో గల కస్పా హైస్కూల్ వద్ద ఉన్న ఏపీ బీసీ సర్కిల్ కార్యాలయంలో ఈనెల 11వ తేదీలోపు దరఖాస్తులు అందించాలన్నారు. బీసీ, ఈబీసీ అభ్యర్థులు అర్హులని వెల్లడించారు.
News April 9, 2025
సలేశ్వరం జాతరకు ప్రత్యేక బస్సులు

సలేశ్వరం జాతరకు అచ్చంపేట ఆర్టీసీ డిపో నుంచి మూడు రోజులపాటు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ ప్రసాద్ తెలిపారు. అచ్చంపేట నుంచి మొదటి బస్సు ఉదయం 6 గంటలకు బయలుదేరుతుందని చివరి బస్సు సాయంత్రం 4 గంటలకు ఉంటుందని తెలిపారు. జాతరకు వెళ్లే భక్తులకు ఎలాంటి సౌకర్యం లేకుండా సకాలంలో బస్సులు నడుపుతామని డీఎం తెలిపారు.
News April 9, 2025
ఎన్టీఆర్-నీల్ మూవీ అప్డేట్ వచ్చేసింది

యంగ్‌టైగర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న ఓ భారీ ప్రాజెక్ట్ నుంచి అప్డేట్ వచ్చింది. ఈ నెల 22 నుంచి ఎన్టీఆర్ షూటింగ్‌లో పాల్గొంటారని మూవీ మేకర్స్ తెలిపారు. ఈ క్రేజీ అప్డేట్‌తో తారక్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.