News April 2, 2025
ఏలూరు జిల్లాలో 112 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఏలూరు జిల్లాలో మహిళా శిశు అభివృద్ధి సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధింత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 10 సీడీపీవోల కార్యాలయాల పరిధిలోని అంగన్వాడీ కమిటీ ఛైర్మన్ కె.వెట్రిసెల్వి మంగళవారం ఆమోదించారని ఐసీడీఎస్ పీడీ శారద తెలిపారు. 12 మంది అంగన్వాడీలు, ఏడుగురు మిని వర్కర్సు. 93మంది హెల్పర్లను గౌరవ వేతనంపై తీసుకుంటామన్నారు. స్థానిక మహిళలై ఉండి పదవ తరగతిలో ఉత్తీర్ణలై ఉండాలన్నారు.
Similar News
News April 4, 2025
జమ్మికుంట: మున్సిపల్ కమిషనర్‌కు రాష్ట్రస్థాయి అవార్డు

ఆస్తిపన్ను వసూళ్లలో రాష్ట్రస్థాయిలో జమ్మికుంట మొదటిస్థానం దక్కించుకుంది. దీంతో మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్‌కు మున్సిపల్ పరిపాలన కమిషనర్, డైరెక్టర్ కె.శ్రీదేవి హైదరాబాద్‌లో గురువారం రాష్ట్రస్థాయి ప్రశంసాపత్రం అందజేశారు. అదేవిధంగా చొప్పదండి పట్టణంలో 84శాతం ఆస్తిపన్ను వసూలు చేసినందుకు మున్సిపల్ కమిషనర్ నాగరాజును అభినందించారు.
News April 4, 2025
నేటి నుంచి సబ్ రిజస్ట్రార్ ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్

AP: రిజిస్ట్రేషన్ కోసం గంటల తరబడి వేచి చూడకుండా నేటి నుంచి స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకి రానుంది. దీంతో స్లాట్ బుక్ చేసుకున్న సమయానికి రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వెళ్తే చాలు. ఇప్పటికే కృష్ణా (D)లో ఈ విధానం పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు అవుతోంది. ఇవాళ్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రధాన సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కొత్త విధానం అందుబాటులోకి రానుంది. మంత్రి అనగాని సచివాలయం నుంచి ఈ సేవలను ప్రారంభిస్తారు.
News April 4, 2025
వరంగల్: మాయదారి వానలు.. అప్పులే గతి!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుతం పంటలన్నీ చివరి దశకు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో వర్షం పడితే అప్పులే దిక్కు అని ఓరుగల్లు రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. పర్వతగిరి, నెక్కొండ, రాయపర్తిలో మొక్కజొన్న, వరి చివరిదశకు చేరుకోగా.. తొర్రూరు, కొత్తగూడతో పాటు పలుప్రాంతాల్లో పంటకోసి కుప్పనూర్చారు. ఇప్పుడు ఈదురు గాలులతో వర్షం పడితే పంట నేలకు ఒరిగే అవకాశముంది. వర్షం ఎప్పుడు పడుతుందోనని ఆందోళన పడుతున్నారు.