News April 2, 2025
రాజీవ్ యువ వికాస పథకంపై విస్తృత అవగాహన కల్పించండి: కలెక్టర్

రాజీవ్ యువ వికాస పథకంపై విస్తృత అవగాహన కల్పించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. అర్హులైన యువత ఆన్లైన్లో దరఖాస్తు చేసి, ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాల్లో సమర్పిస్తే, వాటిని కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన హెల్ప్ డెస్క్ ద్వారా ఆన్లైన్ చేస్తామని తెలియజేశారు. అధికారులు ప్రజలకు అవగహన కల్పించాలన్నారు.
Similar News
News April 4, 2025
NLG: తగ్గిన కోళ్ల ఉత్పత్తి.. పెరిగిన చికెన్ ధరలు

నల్గొండ జిల్లాలో చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. బర్డ్ ఫ్లూ భయంతో రెండు నెలల క్రితం కేజీ రూ.150 నుంచి రూ.180 మధ్యే ఉన్న చికెన్ ధర ప్రస్తుతం రూ.250 నుంచి రూ.280 వరకు పలుకుతోంది. బర్డ్ ఫ్లూ భయం తొలగడంతో పాటు రంజాన్ పండుగ నేపథ్యంలో చికెన్‌కు డిమాండ్ పెరగడం, వేసవి కారణంగా కోళ్ల ఉత్పత్తి తగ్గడంతో ధరలు అమాంతం పెరిగినట్లు తెలుస్తుంది.
News April 4, 2025
సిద్ధిపేట జిల్లాలో వర్ష బీభత్సం

సిద్ధిపేట జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. మరో 10 రోజుల్లో చేతికివస్తాయనకున్న వరి, మొక్కజోన్న, ఉల్లి పంటలు గురువారం కురిసిన వర్షానికి నేలవాలాయి. పలు మండలాల్లో మామిడి తోటలు సైతం దెబ్బతిన్నాయి. వర్షం, ఈదురు గాలులతో పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
News April 4, 2025
జగిత్యాల: కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

జగిత్యాల రూరల్ మండలం పోరండ్ల గ్రామంలో గురువారం విద్యుదాఘాతంతో రైతు దేవి చంద్రయ్య(55) మృతి చెందారు. పొలానికి నీరు పెట్టేందుకు వెళ్తుండగా తెగిపడిన విద్యుత్తు తీగ తగిలి అక్కడికక్కడే చనిపోయారు. సమాచారం అందుకున్న జగిత్యాల రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.