News April 2, 2025

జగిత్యాల జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: ఎస్పీ

image

జగిత్యాల జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఏప్రిల్ 1 నుంచి 30 వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ తెలిపారు. ఈ సమయంలో పోలీసు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. అలాగే, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే విధంగా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని ప్రజలకు సూచించారు.

Similar News

News April 4, 2025

రామగుండం: రైలు కిందపడి యువకుడి మృతి

image

RMG రైల్వే స్టేషన్‌లో రైలు కిందపడి యువకుడు మృతిచెందాడు. ఉత్తరప్రదేశ్‌లోని జైతాపూర్‌కు చెందిన వరుణ్ కుమార్ సింగ్(30) అనే యువకుడు కూలీ పనికోసం HYDకు వెళ్తున్నాడు. RMG స్టేషన్‌‌లో రైలుదిగే సమయంలో కాలుజారి పడిపోయాడు. వెంటనే రైలు కదలడంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. మృతదేహాన్ని GDK ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News April 4, 2025

NLG: జిల్లాలో మామిడికి గడ్డు పరిస్థితులు!

image

ఉద్యాన పంటల్లో ఫలరాజంగా ప్రసిద్ధి చెందిన మామిడికి ఈ ఏడాది గడ్డు పరిస్థితులు దాపురించాయి. గతేడాది సకాలంలో వర్షాలు కురియక, ఈ వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా పూత సకాలంలో రాలేదు. వచ్చిన పూత కూడా నిలవకుండా మాడిపోయింది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో దట్టంగా కురిసిన పొగమంచు పూతను దెబ్బతీసిందని రైతులు తెలిపారు. ఈ ఏడాది కనీసం 1 నుంచి 2 టన్నుల వరకైనా దిగుబడి వచ్చే పరిస్థితి కనిపించడం లేదని రైతులు అంటున్నారు.

News April 4, 2025

NLG: తగ్గిన కోళ్ల ఉత్పత్తి.. పెరిగిన చికెన్ ధరలు

image

నల్గొండ జిల్లాలో చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. బర్డ్ ఫ్లూ భయంతో రెండు నెలల క్రితం కేజీ రూ.150 నుంచి రూ.180 మధ్యే ఉన్న చికెన్ ధర ప్రస్తుతం రూ.250 నుంచి రూ.280 వరకు పలుకుతోంది. బర్డ్ ఫ్లూ భయం తొలగడంతో పాటు రంజాన్ పండుగ నేపథ్యంలో చికెన్‌కు డిమాండ్ పెరగడం, వేసవి కారణంగా కోళ్ల ఉత్పత్తి తగ్గడంతో ధరలు అమాంతం పెరిగినట్లు తెలుస్తుంది.

error: Content is protected !!