News April 2, 2025

వక్ఫ్ ఆస్తులు ఆ రాష్ట్రంలోనే అత్యధికం

image

దేశంలో వక్ఫ్ ఆస్తులు అత్యధికంగా ఉత్తర్ ప్రదేశ్‌లో ఉన్నట్లు ఇండియా టుడే పేర్కొంది. 27 శాతం ఆస్తులు ఆ రాష్ట్రంలోనే ఉన్నాయంది. ఆ తర్వాతి స్థానాల్లో వెస్ట్ బెంగాల్(9%), పంజాబ్(9%), తమిళనాడు(8%), కర్ణాటక(7%), కేరళ(6%), తెలంగాణ(5%), గుజరాత్(5%) ఉన్నాయని వెల్లడించింది. ఇవాళ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభలో ప్రవేశపెట్టిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై చర్చ జరుగుతోంది.

Similar News

News April 4, 2025

నేటి నుంచి సబ్ రిజస్ట్రార్ ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్

image

AP: రిజిస్ట్రేషన్ కోసం గంటల తరబడి వేచి చూడకుండా నేటి నుంచి స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకి రానుంది. దీంతో స్లాట్‌ బుక్ చేసుకున్న సమయానికి రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వెళ్తే చాలు. ఇప్పటికే కృష్ణా (D)లో ఈ విధానం పైలట్‌ ప్రాజెక్ట్‌గా అమలు అవుతోంది. ఇవాళ్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రధాన సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కొత్త విధానం అందుబాటులోకి రానుంది. మంత్రి అనగాని సచివాలయం నుంచి ఈ సేవలను ప్రారంభిస్తారు.

News April 4, 2025

మరో నెల రోజులు ఆస్పత్రిలోనే కొడాలి నాని

image

AP: YCP నేత కొడాలి నాని బైపాస్ సర్జరీ విజయవంతమైనట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ‘ముంబైలోని ఏషియన్ హార్ట్ కేర్ ఇన్‌స్టిట్యూట్ చీఫ్ సర్జన్ రమాకాంత్ పాండే 8 నుంచి 10 గంటల పాటు శ్రమించి సర్జరీ చేశారు. ఆయన అవయవాలన్నీ బాగానే స్పందిస్తున్నాయి. కొన్ని రోజులపాటు ఆయన ఐసీయూలోనే ఉంటారు. ఆ తర్వాత వైద్యుల పర్యవేక్షణలో నెల రోజులపాటు నాని ముంబైలోనే ఉండనున్నారు, త్వరలోనే కోలుకుని తిరిగి వస్తారు’ అని తెలిపారు.

News April 4, 2025

IPL: రూ.23.75 కోట్లు పెట్టింది ఇందుకే..

image

మెగా వేలంలో రూ.23.75 కోట్లకు అమ్ముడైన వెంకటేశ్ అయ్యర్ ఈ సీజన్లోని తొలి మూడు మ్యాచుల్లో పరుగులు చేయలేక ఇబ్బంది పడ్డారు. నిన్న SRHపై తిరిగి ఫామ్ అందుకున్నారు. 29 బంతుల్లోనే 3 సిక్సర్లు, 7 ఫోర్లతో 60 రన్స్ చేశారు. ఆరంభంలో స్లోగా ఆడిన అతడు.. చివరి ఓవర్లలో రింకూతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశారు. SRHపై వెంకీకి మంచి రికార్డు ఉంది. ఆరెంజ్ ఆర్మీపై 9 మ్యాచుల్లో 152 స్ట్రైక్ రేటుతో 208 రన్స్ చేశారు.

error: Content is protected !!