News April 2, 2025

అది గుర్తొచ్చినప్పుడల్లా గూస్‌బంప్స్ వస్తాయి: యువీ

image

వన్డే వరల్డ్ కప్‌-2011ను టీమ్ఇండియా గెలుపొందడంపై మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘APR 2, 2011. ఆ రాత్రి వంద కోట్ల మంది కోసం పోరాడాం. అలాగే రెండు దశాబ్దాలకు పైగా భారత క్రికెట్‌ను తన భుజాలపై మోసిన లెజెండ్ సచిన్‌కు ఈ విజయం అంకితం చేశాం. ఇన్నేళ్లయినా ఆ విజయాన్ని గుర్తుచేసుకుంటే ఇప్పటికీ నాకు గూస్‌బంప్స్ వస్తాయి. ఆ రాత్రిని ఎప్పటికీ మర్చిపోలేం’ అని ఆయన Xలో రాసుకొచ్చారు.

Similar News

News November 14, 2025

జూబ్లీహిల్స్ రిజల్ట్స్.. నల్గొండ వాసుల ఫోకస్

image

జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాన్ని నల్గొండ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. అధికార కాంగ్రెస్ గెలుస్తుందా? ప్రతిపక్ష బీఆర్ఎస్ గెలుస్తుందా? అని ప్రజలలో ఉత్కంఠ రేపుతుంది. ఈ ఎన్నికల ఫలితాలు స్థానిక ఎన్నికలపై ప్రభావం చూపుతాయని రాజకీయ విశ్లేషకులు చెబుతుండగా.. గ్రామాల్లో నలుగురు కలిస్తే జూబ్లీ ఫలితంపైనే చర్చిస్తున్నారు. కాంగ్రెస్ విజయం సాధిస్తే ఇదే ఊపుతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశముందని టాక్.

News November 14, 2025

బీజాక్షరం అంటే ఏంటి..?

image

బీజాక్షరం అంటే దైవశక్తికి మూలశబ్దం. బీజమంటే విత్తనం. అక్షరమంటే నాశనం లేని శబ్దం. చిన్న విత్తులో గొప్ప వృక్షం దాగి ఉన్నట్లే దేవతాశక్తి బీజాక్షరంలో ఇమిడి ఉంటుంది. ప్రతి దేవతకు ఒక బీజం ఉంటుంది. మంత్రాలలో ప్రధానంగా, శక్తివంతంగా ఉండే ఈ అక్షరమే ఆ మంత్రానికి తాళం చెవి వంటిది. దీనిని పఠించడం ద్వారా మనం ఆ దేవత సంపూర్ణ అనుగ్రహాన్ని, శక్తిని పొందగలం. ఇది ఆధ్యాత్మిక సాధనకు అత్యంత ముఖ్యమైన మూలం. <<-se>>#VedikVibes<<>>

News November 14, 2025

3 చోట్ల ముందంజలో ప్రశాంత్ కిశోర్ పార్టీ

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కు చెందిన జన్ సురాజ్ పార్టీ 3 చోట్ల ముందంజలో కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఈ పార్టీ ప్రభావం చూపించదని అంచనా వేశాయి. కీలకమైన స్థానాల్లోనూ ఓట్ల వాటాను దక్కించుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఎఫెక్ట్ మహాగఠ్‌బంధన్‌పై పడే అవకాశం ఉంది. మరోవైపు NDA కూటమి ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విధంగా దూసుకెళ్తోంది.