News April 2, 2025
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి నివాళి

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్థంతి సందర్భంగా ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన చిత్రపటానికి మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌తో కలిసి మంత్రి కొండా సురేఖ నివాళులర్పించారు. అనంతరం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సేవలను నేతలు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.
Similar News
News April 4, 2025
జగిత్యాల: కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

జగిత్యాల రూరల్ మండలం పోరండ్ల గ్రామంలో గురువారం విద్యుదాఘాతంతో రైతు దేవి చంద్రయ్య(55) మృతి చెందారు. పొలానికి నీరు పెట్టేందుకు వెళ్తుండగా తెగిపడిన విద్యుత్తు తీగ తగిలి అక్కడికక్కడే చనిపోయారు. సమాచారం అందుకున్న జగిత్యాల రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
News April 4, 2025
తూ.గో: నేడు పిడుగులు పడే అవకాశం

తూ.గో జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA ఎక్స్‌లో పోస్టు చేసింది. పిడుగుల పడే ఛాన్స్ ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గురువారం తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడిన విషయం తెలిసిందే. తూ.గో జిల్లా నల్లజర్లలో నిన్న మధ్యాహ్నం పలు గ్రామాల్లో వర్షం కురిసింది. ఈ అకాల వర్షాలకు పంటలు నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News April 4, 2025
వరంగల్: మాయదారి వానలు.. అప్పులే గతి!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుతం పంటలన్నీ చివరి దశకు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో వర్షం పడితే అప్పులే దిక్కు అని ఓరుగల్లు రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. పర్వతగిరి, నెక్కొండ, రాయపర్తిలో మొక్కజొన్న, వరి చివరిదశకు చేరుకోగా.. తొర్రూరు, కొత్తగూడతో పాటు పలుప్రాంతాల్లో పంటకోసి కుప్పనూర్చారు. ఇప్పుడు ఈదురు గాలులతో వర్షం పడితే పంట నేలకు ఒరిగే అవకాశముంది. వర్షం ఎప్పుడు పడుతుందోనని ఆందోళన పడుతున్నారు.