News April 2, 2025
సిరిసిల్ల: శిక్షణ శిబిరాల నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం

వేసవి క్రీడాశిక్షణ శిబిరాల నిర్వహణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా యువజన క్రీడాశాఖ అధికారి ఏ.రామదాసు తెలిపారు. జిల్లాలోని గ్రామాల్లో మే 1 నుంచి 31 వరకు 14 ఏళ్లలోపు బాల బాలికలకు వివిధ క్రీడల్లో శిక్షణ ఇవ్వడానికి క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. ఈనెల 11న సాయంత్రం 5 గంటల్లోపు కలెక్టరేట్లో దరఖాస్తులు సమర్పించాలన్నారు.
Similar News
News July 7, 2025
పెద్దపల్లి: అర్జీల పరిష్కారంలో వేగం పాటించండి: కలెక్టర్

పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ డి.వేణుతో కలిసి ప్రజల దరఖాస్తులు స్వీకరించారు. సుల్తానాబాద్‌కు చెందిన రాములు భూమి గల్లంతు అంశంపై, రామగుండం 8 ఇంక్లైన్‌కి చెందిన రాజమ్మకు భూసేకరణ పరిహారం సమస్యపై వచ్చిన ఫిర్యాదులకు తహశీల్దార్లకు రాసి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
News July 7, 2025
తెలంగాణ కాంగ్రెస్ ఉమ్మడి జిల్లాల ఇన్‌ఛార్జులు

* ఖమ్మం- వంశీచంద్ రెడ్డి, * మెదక్- పొన్నం ప్రభాకర్
* నల్గొండ- సంపత్ కుమార్
* వరంగల్- అడ్లూరి లక్ష్మణ్
* హైదరాబాద్- జగ్గారెడ్డి
* మహబూబ్‌నగర్- కుసుమకుమార్
* ఆదిలాబాద్- అనిల్ యాదవ్
* కరీంనగర్- అద్దంకి దయాకర్
* నిజామాబాద్- హుస్సేన్
* రంగారెడ్డి- శివసేనారెడ్డి
News July 7, 2025
కిలోకు రూ.12 చెల్లించి మామిడి కొనుగోళ్లు

AP: మద్దతు ధర లేక అల్లాడుతున్న తోతాపురి మామిడి రైతులకు ప్రభుత్వం ఆదుకుంటోంది. ప్రస్తుతం కేజీకి రూ.8 చెల్లిస్తుండగా, ప్రభుత్వం అదనంగా రూ.4 ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కిలో మామిడికి రూ.12 చెల్లిస్తున్నారు. చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో 3.08 మెట్రిక్ టన్నుల మేర మామిడిని ట్రేడర్లు, ప్రాసెసింగ్ యూనిట్ల వారు కొనుగోలు చేశారు.