News April 2, 2025

మధురవాడ: తల్లి, కుమార్తెపై ప్రేమోన్మాది దాడి

image

విశాఖలో బుధవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. కొమ్మాది సమీపంలోని స్వయంకృషి నగర్‌లో తల్లి, కూతురిపై ఒక ప్రేమోన్మాది దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో తల్లి అక్కడికక్కడే మృతిచెందిగా కుమార్తె పరిస్థితి విషమంగా మారింది. స్థానికులు సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 11, 2026

విశాఖ జూ పార్క్‌లో ముగిసిన వింటర్ క్యాంప్

image

విశాఖ జూ పార్క్‌లో 4 రోజుల నుంచి జరుగుతున్న వింటర్ క్యాంప్ ఆదివారంతో ముగిసింది. జనవరి 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఈ క్యాంప్ నిర్వహించిన్నట్లు క్యూరేటర్ మంగమ్మ తెలిపారు. వింటర్ క్యాంప్‌తో వన్యప్రాణుల ప్రపంచాన్ని పిల్లలకు పరిచయం చేశారు. ముఖ్యంగా జూ పార్కులో వెటర్నరీ హాస్పిటల్, జంతువుల నివాసాలు, వాటి ఆహారపు అలవాట్లు, వాటి ప్రత్యేక లక్షణాలపై అవగాహన కల్పించారు.

News January 11, 2026

సైబర్ క్రైమ్ ముఠా ఉచ్చు నుంచి బయటపడ్డ ఉత్తరాంధ్ర యువకులు

image

ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాలకు చెందిన 27 మంది యువకులు మయన్మార్‌లో సైబర్ క్రైమ్ ముఠాకు చిక్కుకొని నరకయాతన పడ్డారు. యువకులు ఈ విషయాన్ని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్పందించి విదేశాంగ శాఖ మంత్రితో మాట్లాడి తిరిగి మన దేశానికి తీసుకొచ్చారు. ఆదివారం విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న యువకులు మంత్రికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

News January 11, 2026

రేపు పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’

image

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) జరగనుంది. పోలీస్ కాన్ఫరెన్స్ హాల్, ఆర్ముడ్ రిజర్వ్ ఆఫీస్ వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నగర ప్రజలు తమ సమస్యలను నేరుగా కమిషనర్‌కి తెలియజేసి, సత్వర పరిష్కారం పొందేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పోలీస్ అధికారులు సూచించారు.