News April 2, 2025

నిర్మల్: సాంఘిక పరీక్షకు 12 మంది గైర్హాజరు: డీఈవో

image

ఎలాంటి పొరపాట్లు లేకుండా పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా విజయవంతంగా ముగిశాయని డీఈవో రామారావు అన్నారు. బుధవారం తానూర్ మండలం బోసి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాన్ని సందర్శించారు. నేడు జరిగిన సాంఘిక పరీక్షకు జిల్లావ్యాప్తంగా 9117 మంది విద్యార్థులు హాజరయ్యారని పేర్కొన్నారు. 12 మంది పరీక్ష రాయలేదని చెప్పారు.

Similar News

News April 4, 2025

మక్తల్: బైక్‌లో ఉంచిన.. రూ.1,50,000 చోరీ

image

బ్యాంకు దగ్గర బైక్‌లో ఉంచిన నగదును గుర్తు తెలియని వ్యక్తి చోరీ చేసిన ఘటన మక్తల్ పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. SI భాగ్యలక్ష్మి రెడ్డి కథనం మేరకు.. మాగనూరు మండలం నేరేడుగం గ్రామానికి చెందిన లింగాయత్ నాగప్ప మక్తల్ పట్టణంలోని SBIలో రూ. 1,50,000 డ్రా చేశాడు. బ్యాంక్ ఎదుట పార్క్ చేసిన తన బైక్‌లో ఉంచి అక్కడే ఉన్న జిరాక్స్ సెంటర్‌కు వెళ్లి వచ్చేసరికి నగదు మాయమైందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

News April 4, 2025

పార్వతీపురం మన్యం జిల్లాలో నేటి ఉష్ణోగ్రతల వివరాలు..

image

పార్వతీపురం జిల్లాలో శుక్రవారం ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని APSDM తెలిపింది. ఉదయం 10 తర్వాత బయటికొచ్చే వారంతా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సాలూరులో 37.1°C, మక్కువ 39.1, పాచిపెంట 36.8, కురుపాం 40.8, గరుగుబిల్లి 41.3, గుమ్మలక్ష్మీపురం 41.2, కొమరాడ 40.7, జియ్యమ్మవలస 41.2, పార్వతీపురం 40.3, సీతానగరం 40.6, బలిజిపేట 40.3, పాలకొండ 39.4, వీరఘట్టం 40.3, సీతంపేట 39, భామిలో 39.7గా నమోదౌతాయని తెలిపింది.

News April 4, 2025

BIG ALERT: నేడు భారీ వర్షాలు

image

ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. TGలోని ములుగు, వరంగల్, వికారాబాద్, RR, మేడ్చల్, యాదాద్రి, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. APలోని అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

error: Content is protected !!