News April 2, 2025

కంచ గచ్చిబౌలి భూములపై నివేదిక కోరిన కేంద్రం

image

TG: కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిపై వాస్తవిక నివేదిక ఇవ్వాలని రాష్ట్ర అటవీశాఖను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అటవీ చట్టానికి లోబడి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. కోర్టులు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించలేదన్న విషయాన్ని నిర్ధారించుకోవాలని పేర్కొంది.

Similar News

News April 4, 2025

ఫార్మసీ విద్యార్థిని అంజలి మృతి

image

AP: రాజమండ్రిలోని బొల్లినేని కిమ్స్ ఆస్పత్రిలో 12 రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న ఫార్మసీ విద్యార్థిని నాగ అంజలి మృతిచెందారు. ఇవాళ తెల్లవారుజామున స్ట్రోక్ రావడంతో ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఓ వ్యక్తి చేతిలో మోసపోయానని గత నెల 23న ఆమె ఆత్మహత్యాయత్నం చేశారు. సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

News April 4, 2025

BIG ALERT: నేడు భారీ వర్షాలు

image

ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. TGలోని ములుగు, వరంగల్, వికారాబాద్, RR, మేడ్చల్, యాదాద్రి, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. APలోని అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

News April 4, 2025

రైతులకు గుడ్‌న్యూస్.. యాసంగిలోనూ బోనస్

image

TG: ప్రస్తుత యాసంగిలోనూ సన్న ధాన్యానికి బోనస్ ఇవ్వనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా నాయకన్‌గూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించి మాట్లాడారు. గత వానాకాలం సీజన్‌లో క్వింటాకు రూ.500 చొప్పున మొత్తం రూ.1700 కోట్ల బోనస్ అందజేశామన్నారు. దేశంలో రైతులకు బోనస్ ఇస్తున్న తొలి ప్రభుత్వం తమదేనన్నారు. వరి దిగుబడిలో ఏపీని తెలంగాణ అధిగమించిందని పేర్కొన్నారు.

error: Content is protected !!