News April 2, 2025
నారాయణపేట: ‘పాపన్న గౌడ్ పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకోవాలి’

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట పటిమను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అన్నారు. బుధవారం నారాయణపేట కలెక్టరేట్లో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్థంతి నిర్వహించారు. అదనపు కలెక్టర్ పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. బడుగుబలహీన వర్గాలకు చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు.
Similar News
News July 6, 2025
VJA: ఆదిత్య ఫార్మసీ ఎండీ ఆత్మహత్య ఘటనలో ఇద్దరిపై కేసు నమోదు

ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహరాజు నిన్న విజయవాడలోని క్షత్రియ భవన్లో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఉదయం వాకింగ్‌కు వెళ్తానని చెప్పి సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నారు. తన భర్త మరణానికి బుద్దిరాజు శివాజీ, పిన్నమనేని పరంధామయ్యలే కారణమని భార్య శాంతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News July 6, 2025
రేపు భారీ వర్షాలు

తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని IMD తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని పేర్కొంది. ఇవాళ హైదరాబాద్ సహా దాదాపు అన్ని జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గంటకు 30-40కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
News July 6, 2025
HYD: త్వరలో వాట్సప్ బస్ టికెట్

గ్రేటర్ HYDలో త్వరలో వాట్సప్ టికెటింగ్, డిజిటల్ బస్ పాస్ అమల్లోకి తీసుకొస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఇప్పటికే క్యూఆర్ కోడ్ RTC బస్ టికెట్ విధానం అందుబాటులో ఉంది. జస్ట్ QR కోడ్ స్కాన్ చేసి, ఫోన్లో పేమెంట్ చేస్తే టికెట్ వస్తుంది. ఇవన్నీ ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టంలో ఒక భాగం. ఈ సేవలను మరింత విస్తరిస్తామని తెలిపారు.