News April 2, 2025
‘సుజుకీ’ అమ్మకాల జోరు

కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 12,56,161 యూనిట్లను 2024-25 ఫైనాన్షియల్ ఇయర్‌లో సేల్ చేసినట్లు సుజుకీ మోటార్‌సైకిల్ ప్రకటించింది. FY 2023-24లో 11,33,902 యూనిట్లు విక్రయించినట్లు వెల్లడించింది. న్యూయాక్సెస్ స్కూటర్, గిక్షర్ SF250 వేరియంట్లతో అమ్మకాలు విపరీతంగా పెరిగినట్లు చెప్పింది. అటు IND మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో-2025లో సంస్థ ప్రదర్శించిన ఈ-యాక్సెస్ స్కూటర్ వేరియంట్‌తోనూ విక్రయాలు జోరందుకున్నాయి.
Similar News
News September 11, 2025
వార్డ్‌రోబ్ నుంచి వాసన వస్తోందా?

వర్షాకాలంలో దుస్తులు ఆరడం పెద్ద సమస్య. ఆరడానికి చాలాసమయం పట్టడంతో పాటు, అదోరకమైన వాసన వస్తుంది. ఇలాకాకుండా ఉండాలంటే దళసరి, పల్చటి బట్టలను వేర్వేరుగా ఉతికి, ఆరేయాలి. నానబెట్టే ముందు సర్ఫ్‌లో కాస్త బేకింగ్ సోడా, నిమ్మరసం కలపాలి. సువాసన కోసం కండీషనర్స్ బదులు రోజ్ వాటర్ కలిపిన నీటితో జాడించి ఆరేయాలి. వార్డ్‌రోబ్‌లో రోజ్మెరీ, నాఫ్తలీన్ బాల్స్, సిలికాజెల్ ప్యాకెట్స్ పెడితే దుర్వాసన రాకుండా ఉంటుంది.
News September 11, 2025
అధిక పాలనిచ్చే ‘జఫరాబాది’ గేదెలు

జఫరాబాది జాతి గేదెలు గుజరాత్‌కు చెందినవి. వీటి కొమ్ములు మెలి తిరిగి ఉంటాయి. పొదుగు విస్తారంగా ఉంటుంది. నలుపు రంగులో ఉండే వీటి శరీర బరువు దాదాపు 460KGలు ఉంటుంది. ఇవి మొదటిసారి 36-40 నెలలకు ఎదకు వస్తాయి. 48-51 నెలల వయస్సులో మొదటి దూడకు జన్మనిస్తాయి. రోజుకు 15-18 లీటర్ల చొప్పున పాడి కాలంలో 2,336 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తాయి. వెన్న 9-10% వరకు వస్తుంది. ఒక్కో గేదె ధర రూ.80K-రూ.లక్ష వరకు ఉంటుంది.
News September 11, 2025
మొక్కజొన్న: ఎరువుల యాజమాన్యం, తెగుళ్ల నివారణ

* పూత దశలో మొక్కజొన్న పంటకు 50KGల యూరియా, 20KGల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వేసి, నీటి తడిని ఇవ్వాలి.
* పేను బంక ఆశిస్తే డైమిథోయేట్ 30EC 2 ML లీటరు నీటికి, ఆకుమచ్చ, ఆకు మాడు తెగుళ్లు ఆశిస్తే 2.5గ్రా. మ్యాంకోజెబ్/1మి.లీ ప్రొపికొనజోల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
* కాండం కుళ్లు తెగులు కనిపిస్తే 100KGల వేప పిండి, 4KGల 35% క్లోరిన్ కలిగిన బ్లీచింగ్ పౌడర్‌ను కలిపి మొక్కల మొదళ్ల దగ్గర వేయాలి.