News April 2, 2025
దైవం మనుష్య రూపేణ.. మహేశ్‌పై ప్రశంసలు!

గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే చిన్నారులకు సూపర్ స్టార్ మహేశ్‌బాబు ఉచితంగా వైద్యం చేయిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన ఫౌండేషన్ 4500కు పైగా హార్ట్ ఆపరేషన్స్ చేయించింది. తాజాగా పుట్టుకతోనే గుండె జబ్బులతో ఇబ్బంది పడుతున్న ఇద్దరు చిన్నారులకు విజయవంతంగా ఆపరేషన్ చేయించినట్లు పేర్కొంది. ఇందులో ఒకరికి రెండేళ్లు, మరొకరికి నాలుగు నెలలు మాత్రమే. దీంతో మహేశ్‌ది గొప్ప మనసంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు.
Similar News
News April 4, 2025
APPLY NOW.. నేటితో ముగియనున్న గడువు

TG: ఈఏపీసెట్-2025 దరఖాస్తుల గడువు నేటితో ముగియనుంది. APR 9 వరకు రూ.250, 14 వరకు రూ.500, 18 వరకు రూ.2,500, 24 వరకు రూ.5వేల ఆలస్య రుసుముతో దరఖాస్తుకు అవకాశం కల్పించారు. మరోవైపు, ఏప్రిల్ 6-8 మధ్య ఈఏపీసెట్ అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి రానుంది. ఆ సమయంలో దరఖాస్తుల్లో తప్పులుంటే సరి చేసుకోవచ్చు. APR 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ.. మే 2-5ల్లో ఇంజినీరింగ్ పరీక్షలు జరగనున్నాయి.
News April 4, 2025
SRH బౌలింగ్ బాగానే ఉంది: కమిన్స్

KKRతో మ్యాచ్ ఓడిపోవడంపై SRH కెప్టెన్ కమిన్స్ స్పందించారు. బౌలింగ్ బాగానే ఉందని, కీలక సమయాల్లో క్యాచ్‌లు వదిలేయడం వల్లే ఓడాల్సి వచ్చిందన్నారు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా లేదని భావించి జంపాను ఆడించలేదని తెలిపారు. స్పిన్నర్లు బంతిని సరిగా గ్రిప్ చేయలేకపోయారని, అందుకే వాళ్లతో 3 ఓవర్లే వేయించినట్లు వివరించారు. మరోవైపు, స్పిన్నర్లను సరిగా ఉపయోగించకపోవడం వల్లే మ్యాచ్ ఓడిపోయిందని విమర్శలు వస్తున్నాయి.
News April 4, 2025
తీవ్ర విషాదం.. బావిలో విషవాయువులు పీల్చి 8 మంది మృతి

మధ్యప్రదేశ్ కొండవాట్‌లో విగ్రహాల నిమజ్జనం కోసం పాడుబడ్డ బావిని శుభ్రం చేసేందుకు వెళ్లి 8 మంది మరణించారు. గంగౌర్ పండుగ నేపథ్యంలో 150 ఏళ్ల బావిని శుభ్రం చేసేందుకు తొలుత ఓ కూలీ బావిలోకి దిగాడు. బావిలోని విషవాయువులు పీల్చి మునిగిపోతుండగా అతడిని కాపాడేందుకు మిగిలిన కూలీలు అందులోకి దిగారు. ఇలా మొత్తం 8 మంది ప్రాణాలు వదిలారు. వారికి ఈత వచ్చినా విషవాయువులు పీల్చి నీటిలో మునిగిపోయారని అధికారులు తెలిపారు.