News April 2, 2025
ఐసీసీ ర్యాంకింగ్స్: చరిత్ర సృష్టించాడు!

NZ బౌలర్ డఫీ ICC T20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచారు. ఈక్రమంలో ఆ దేశం తరఫున ఏ ఫార్మాట్లోనైనా అగ్రస్థానం దక్కించుకున్న తొలి ఫాస్ట్ బౌలర్‌గా చరిత్ర సృష్టించారు. బౌలర్లలో వరుణ్ 3వస్థానంలో, ఆల్‌రౌండర్లలో పాండ్య అగ్రస్థానంలో నిలిచారు. భారత ఆటగాళ్ల ర్యాంకులు చూస్తే..
T20 Batting: అభిషేక్-2, తిలక్-4, సూర్య-5
ODI Batting: గిల్-1, రోహిత్-3, కోహ్లీ-5, శ్రేయర్-8
ODI Bowling: కుల్‌దీప్-3, జడేజా-9
Similar News
News April 4, 2025
SRH బౌలింగ్ బాగానే ఉంది: కమిన్స్

KKRతో మ్యాచ్ ఓడిపోవడంపై SRH కెప్టెన్ కమిన్స్ స్పందించారు. బౌలింగ్ బాగానే ఉందని, కీలక సమయాల్లో క్యాచ్‌లు వదిలేయడం వల్లే ఓడాల్సి వచ్చిందన్నారు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా లేదని భావించి జంపాను ఆడించలేదని తెలిపారు. స్పిన్నర్లు బంతిని సరిగా గ్రిప్ చేయలేకపోయారని, అందుకే వాళ్లతో 3 ఓవర్లే వేయించినట్లు వివరించారు. మరోవైపు, స్పిన్నర్లను సరిగా ఉపయోగించకపోవడం వల్లే మ్యాచ్ ఓడిపోయిందని విమర్శలు వస్తున్నాయి.
News April 4, 2025
తీవ్ర విషాదం.. బావిలో విషవాయువులు పీల్చి 8 మంది మృతి

మధ్యప్రదేశ్ కొండవాట్‌లో విగ్రహాల నిమజ్జనం కోసం పాడుబడ్డ బావిని శుభ్రం చేసేందుకు వెళ్లి 8 మంది మరణించారు. గంగౌర్ పండుగ నేపథ్యంలో 150 ఏళ్ల బావిని శుభ్రం చేసేందుకు తొలుత ఓ కూలీ బావిలోకి దిగాడు. బావిలోని విషవాయువులు పీల్చి మునిగిపోతుండగా అతడిని కాపాడేందుకు మిగిలిన కూలీలు అందులోకి దిగారు. ఇలా మొత్తం 8 మంది ప్రాణాలు వదిలారు. వారికి ఈత వచ్చినా విషవాయువులు పీల్చి నీటిలో మునిగిపోయారని అధికారులు తెలిపారు.
News April 4, 2025
సరికొత్త యుగానికి నాంది: ప్రధాని మోదీ

పార్లమెంట్లో వక్ఫ్ బిల్లు ఆమోదం పొందడం చరిత్రాత్మకమని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఇది సరికొత్త యుగానికి నాంది అన్నారు. మద్దతు తెలిపిన ప్రజలు, చర్చల్లో పాల్గొన్న ఎంపీలకు కృతజ్ఞతలు తెలిపారు. దశాబ్దాలుగా వక్ఫ్ వ్యవస్థలో పారదర్శకత లోపించిందన్నారు. ఇది ముస్లిం మహిళలు, పేదలపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. ఇకపై ఈ పరిస్థితి మారుతుందని స్పష్టం చేశారు. ప్రతి పౌరుడి గౌరవానికి ప్రాధాన్యమిస్తామని ఉద్ఘాటించారు.