News April 2, 2025

గెలిచినా, ఓడినా ఒకేలా ఉండండి.. LSG ఓనర్‌కు నెటిజన్ల క్లాస్!

image

నిన్నటి మ్యాచ్‌లో PBKSపై LSG ఓడిపోవడంతో ఆ జట్టు ఓనర్ సంజీవ్ గోయెంకా కెప్టెన్ పంత్‌పై సీరియస్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. మొన్న మ్యాచ్ గెలిచినప్పుడు ఈయనే పంత్‌కు సెల్యూట్ చేస్తూ, హత్తుకుంటూ అభినందించారు. గెలిచినప్పుడు ఒకలా.. ఓడినప్పుడు మరోలా ప్రవర్తించడంపై విమర్శలొస్తున్నాయి. ఇలా చేయడం కరెక్ట్ కాదని, ఓటమిలో ప్లేయర్లకు అండగా ఉండి వారిని ఎంకరేజ్ చేయాలని నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు.

Similar News

News April 9, 2025

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పాస్‌పోర్టును పాస్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా రద్దు చేసింది. ఆయనపై రెడ్ కార్నర్ నోటీసులతో అథారిటీ ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం, యూఎస్ కాన్సులేట్ సహాయంతో ప్రభాకర్ రావును ఇండియాకు తీసుకువచ్చేందుకు రాష్ట్ర పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

News April 9, 2025

స్కూళ్లకు సెలవులు.. ఎప్పుడు?

image

TG: రాష్ట్రంలో స్కూళ్లకు వేసవి సెలవులపై చర్చ నడుస్తోంది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 23 చివరి పనిదినం కాగా, ఏప్రిల్ 20 నుంచే సెలవులు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో స్కూళ్లకు ఎప్పట్నుంచి సెలవులు ఇస్తారనే దానిపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరా తీస్తున్నారు. ఎండ తీవ్రత నేపథ్యంలో ముందే సెలవులు ఇవ్వాలని కోరుతున్నారు. త్వరలోనే దీనిపై విద్యాశాఖ అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది.

News April 9, 2025

భారత్‌కు మరో 26 రఫేల్ యుద్ధ విమానాలు!

image

26 రఫేల్ మెరైన్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్‌తో భారత్ ఒప్పందం తుది దశకు వచ్చిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రూ.63 వేల కోట్ల అగ్రిమెంట్‌పై త్వరలో ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేయనున్నారని వెల్లడించాయి. ఈ ఒప్పందంలో భాగంగా ఇండియన్ నేవీకి 22 సింగిల్ సీటర్, 4 ఫోర్ సీటర్ విమానాలు సమకూరుతాయని పేర్కొన్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

error: Content is protected !!