News March 26, 2024
ఉమ్మడి విశాఖలో కూటమి సీట్ల పంపకాలు ఇలా..!

ఉమ్మడి విశాఖ జిల్లాలోని TDP-9, జనసేన-4, BJP-2 స్థానాల్లో పోటీ చేయునున్నట్లు తెలుస్తోంది. అరకు, మాడుగుల, చోడవరం, విశాఖ ఈస్ట్, వెస్ట్, గాజువాక, పాయకరావుపేట, నర్సీపట్నంలో TDP అభ్యర్థులను ప్రకటించగా..భీమిలి కూడా TDPకే ఇవ్వనున్నట్లు సమాచారం. అనకాపల్లి, పెందుర్తి, ఎలమంచిలిలో అభ్యర్థులను ప్రకటించిన జనసేన.. విశాఖ సౌత్ సీటు ఆశిస్తుంది. అటు BJPకి విశాఖ నార్త్, పాడేరు సీట్లు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
Similar News
News February 20, 2026
ఏయూ గేటు వద్ద ఏబీవీపీ కార్యకర్తల ఆందోళన

ఆంధ్రా యూనివర్సిటీలో ఏబీవీపీ కార్యకర్తలపై దాడి చేసిన ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను వెంటనే అరెస్టు చేయాలని నినాదాలు చేస్తూ యూనివర్సిటీ గేటు ముందు నిరసన వ్యక్తం చేశారు. వందేమాతరం పాడడం తప్పా.. భారతమాతకు జై అనడం తప్పా.. అంటూ ఏబీవీపీ కార్యకర్తలు ప్రశ్నించారు. వీసీకి ఫిర్యాదు చేయాలే గానీ చట్టాన్ని చేతిలోకి తీసుకొని దాడి చేయడం తగదన్నారు. వారిని అరెస్టు చేసే వరకు ఆందోళన విరమించమని పేర్కొన్నారు.
News February 20, 2026
విశాఖలో ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం

విశాఖలో ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి అధికారులను ఆదేశించారు. జిల్లాలోని 85 కేంద్రాల్లో 81,001 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుతో పాటు తాగునీరు, వైద్య శిబిరాలు, అదనపు బస్సుల సౌకర్యం కల్పించాలని ఆమె సూచించారు. పొరపాట్లు జరగకుండా పరీక్షలను విజయవంతం చేయాలని జేసీ స్పష్టం చేశారు.
News February 20, 2026
గ్లోబల్ ఏఐ సెంటర్‌గా వైజాగ్: గూగుల్ సీఈవో

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ విశాఖతో తనకున్న జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. విద్యార్థిగా చెన్నై నుంచి ఐఐటీ-ఖరగ్‌పూర్ వెళ్లేటప్పుడు కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో విశాఖ మీదుగా ప్రయాణించేవాడినని, అప్పట్లో అది ఎంతో ప్రశాంతమైన నగరమని గుర్తుచేసుకున్నారు. అలాంటి విశాఖ నేడు గ్లోబల్ ఏఐ (AI) హబ్‌గా మారుతుందని తాను ఎప్పుడూ ఊహించలేదని పేర్కొన్నారు. ఈ మార్పు అద్భుతమని ఆయన కొనియాడారు.


