News April 2, 2025
ఈమె ప్రపంచంలోనే అతి సంపన్న మహిళ

ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన అత్యంత సంపన్న మహిళల జాబితాలో వాల్‌మార్ట్ వారసురాలు అలైస్ వాల్టన్(75) అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. ఆమె ఆస్తి 102 బిలియన్ డాల్లరకు పైమాటే. ఈ క్రమంలో గత ఏడాది అగ్రస్థానంలో ఉన్న ‘లోరియల్’ వారసురాలు ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయెర్స్‌ను ఆమె అధిగమించారు. భారత్ నుంచి <<15968880>>జిందాల్ గ్రూప్ ఛైర్‌పర్సన్<<>> సావిత్రి జిందాల్(35.5 బిలియన్ డాలర్లు) అగ్రస్థానంలో ఉన్నారు.
Similar News
News April 4, 2025
రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ‘స్లాట్ బుకింగ్’ సేవలు ప్రారంభం

AP: రాష్ట్రంలోని ప్రధాన సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ‘స్లాట్ బుకింగ్’ సేవలను మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త విధానాన్ని నెలాఖరు నుంచి దశల వారీగా అన్ని రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. వ్యాపారులు, ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని వివరించారు. పేదలకు న్యాయం జరగాలన్న లక్ష్యంతో పని చేస్తున్నట్లు తెలిపారు.
News April 4, 2025
300 కాదు.. సగం కూడా కష్టమే!

IPL-2025: 300 లోడింగ్. SRH ఆడే ప్రతి మ్యాచుకు ముందు అభిమానుల ఆశ ఇది. 300 సంగతి పక్కన పెడితే అందులో సగం కూడా చేయలేకపోతోంది సన్‌రైజర్స్. ఉప్పల్ స్టేడియంలో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించడంతో అక్కడ భారీగా పరుగులు చేస్తున్నారు. మిగతా స్టేడియాల్లో పిచ్, పరిస్థితులను అంచనా వేయకుండా బ్యాట్ ఊపడమే పనిగా పెట్టుకున్నారు. ఫలితంగా ఓపెనర్లు తొలి ఓవర్లలోనే ఔట్ అవుతుండటంతో బ్యాటింగ్ కుప్పకూలుతోంది.
News April 4, 2025
GET READY: మరో రెండు రోజుల్లో..

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కుతున్న పెద్ది సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. మరో రెండు రోజుల్లో ఫస్ట్ షాట్ రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీమ్ ట్వీట్ చేసింది. ఈ విషయం తెలుపుతూ కొత్త పోస్టర్‌ను పంచుకుంది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు.